కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-09-18T06:23:00+05:30 IST

జిల్లాలో ఈ నెల 19న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రతీ దశలోనూ అధికారులు, సిబ్బంది బాధ్యతగా, అప్ర మత్తతో వ్యవహరించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ రిటర్నింగ్‌ అధికారులను కోరారు.

కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
కౌంటింగ్‌ ప్రక్రియపై అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

  • 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ స్థానాలకు 12 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు
  • కొవిడ్‌ జాగ్రత్తలు తప్పసరిగా పాటించాలి: కలెక్టర్‌ హరికిరణ్‌

భానుగుడి (కాకినాడ), సెప్టెంబరు 17: జిల్లాలో ఈ నెల 19న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రతీ దశలోనూ అధికారులు, సిబ్బంది బాధ్యతగా, అప్ర మత్తతో వ్యవహరించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ రిటర్నింగ్‌ అధికారులను కోరారు. శుక్రవారం ఆయన జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ఎ.భార్గవ్‌తేజలతో కలిసి కలెక్టరేట్‌లోని కోర్టు హాలు నుంచి వర్చువల్‌ విధా నంలో ప్రత్యేక రిటర్నింగ్‌ అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవో లతో సమావేశం నిర్వహించారు. క్రమశిక్షణాయుత, ప్రశాంత వాతావర ణంలో కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా ఎన్నికల అథారిటీ పరిధిలోని అదనపు డిప్యూటీ, సహాయ ఎన్నికల అధికారుల విధులను క్షుణ్ణంగా వివరించారు. కౌంటింగ్‌ సిబ్బంది గుర్తింపు, వారికి ఉత్తర్వుల పంపిణీ దగ్గర నుంచి తుది ఫలితాలు వెల్లడి అనంతరం కౌంటింగ్‌ సామగ్రిని సీల్‌చేసి ట్రెజరీలకు చేర్చే వరకు ప్రతీ దశలోనూ సూపర్‌వైజర్లు, సహాయకులు, అటెండెంట్స్‌ విధులను అంశాల వారీగా వివరించారు.

జిల్లాలో మొత్తం 996 ఎంపీటీసీ, 61 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఎంపీటీసీ స్థానాలకు 2,620 మంది, జడ్పీటీసీ స్థానాలకు 234 మంది బరిలో నిలిచారన్నారు. ఆదివారం ఉదదయం 8 గంటలకే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్‌  తెలిపారు. డివిజనల్‌ ప్రధాన కేంద్రాల్లోని 12 ప్రాంతాల్లో కౌంటింగ్‌ జరుగుతుందని వివరించారు. ఎంపీ టీసీ స్థానాలకు 17,90,158, జడ్పీటీసీ స్థానాలకు 19,23,295 ఓట్లు పోల వ్వగా... అమలాపురం, కాకినాడ డివిజన్లలోని రెండు ప్రాంతాలు, పెద్దా పురం డివిజన్‌కు సంబంధించి నాలుగుచోట్ల కౌంటింగ్‌ జరుగుతుంది. రాజమహేంద్రవరం, రామచంద్రపురం, రంపచోడవరం, ఎటపాక డివిజన్లకు సంబంధించి ఒక్కోచోట కౌంటింగ్‌ జరగనుందన్నారు. ఒక మండలం, ఒక హాలు, ఒక ఎంపీటీసీ, ఒక టేబుల్‌ ప్రాతిపదికన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పా ట్లు చేస్తున్నట్టు తెలిపారు. కౌంటింగ్‌ సిబ్బందికి ఆయా ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వనున్నామని, ఇందుకోసం జిల్లా పరిషత్‌లో మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. పోటీ చేసిన అభ్యర్థులకు కౌంటింగ్‌కు సంబంధించి నోటీ సులు అందజేయాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచించిన కొవిడ్‌ జాగ్ర త్తల సమాచారాన్ని అందులో తెలియజేయాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు శాఖను సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని, మీడియా కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం కౌంటింగ్‌ ప్రక్రియ పరిశీలన, సమన్వయ సాధనకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అమలాపురం డివిజన్‌లో కౌంటింగ్‌ ప్రక్రియను జేసీ (రెవెన్యూ) లక్ష్మీశ, పెద్దాపురం డివిజన్‌లో జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, రామచంద్రపురం డివి జన్‌లో జేసీ (హౌసింగ్‌) భార్గవ్‌తేజ, రాజమహేంద్ర వరం, రంపచోడవరం, ఎటపాక డివిజన్లకు సంబంధించి రాజమహేంద్రవరం కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌  లెక్కింపును పర్యవేక్షిస్తారని చెప్పారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్‌ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. చేతులకు శానిటైజేషన్‌, ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, డీపీవో నాగేశ్వర్‌ నాయక్‌, జడ్పీ పరిపాలనాధికారి సుబ్బారావు పాల్గొన్నారు. 

కౌంటింగ్‌ సిబ్బందికి మాస్టర్‌ ట్రైనింగ్‌

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో కౌంటింగ్‌ సిబ్బందికి జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మాస్టర్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొత్తంలో ఓట్ల లెక్కింపు చాలా కీలకమైందని, మాస్టర్‌ ట్రైనర్లు అన్ని అంశాలపై పూర్తిగా అవగాహన పెంపొందించుకుని మండల స్థాయి సూపర్‌వైజర్లకు సక్రమంగా శిక్షణ ఇవ్వాలన్నారు. తక్కువ సమయంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున ఎటువంటి గందరగోళానికి తావులేకుండా ప్రత్యేక శ్రద్ధపెట్టి ప్రశాంత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ జరిగేలా కృషి చేయాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, స్ట్రాంగ్‌ రూమ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, ప్రాథమిక లెక్కింపు తదితర అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) కీర్తి చేకూరి అవగాహన కల్పించారు. జడ్పీ కార్యాలయ పరిపాలనాధికారి సుబ్బారావు, వివిధ మండలాల మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T06:23:00+05:30 IST