కౌంటింగ్‌ పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-09-19T05:23:05+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనల మేరకు ఆదివారం జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించుకోవాలని కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.

కౌంటింగ్‌ పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

ఓర్వకల్లు, సెప్టెంబరు 18: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనల మేరకు ఆదివారం జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించుకోవాలని కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఓర్వకల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై సూపర్‌వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా చేపట్టాలన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవోను కలెక్టర్‌ ఆదేశించారు. శిక్షణలో తలెత్తిన సందేహాలను నివృత్తి చేసుకోవాలని కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను ఆయన సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివరాముడు, ఎంపీడీవో శివనాగప్రసాద్‌, రిటర్నింగ్‌ అధికారి రామునాయక్‌, సూపరింటెండెంట్‌ సరస్వతమ్మ, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.



Updated Date - 2021-09-19T05:23:05+05:30 IST