సంస్కరణలతోనే దేశం ముందుకు: మోదీ

Published: Sun, 05 Jun 2022 02:42:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon

న్యూఢిల్లీ, జూన్‌ 4 : కొవిడ్‌ క్లిష్టసమయంలో ఔషధాలు, టీకాలను ఎగుమతి చేయడం, విదేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, రక్షణపరంగా సొంతకాళ్లపై నిలబడేలా చేపట్టిన చర్యలు.. వీటన్నింటికీ కేంద్రం సంస్కరణలే కారణమని  ప్రధాని మోదీ  పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ దిశగా  కేంద్ర సర్కారు సాధించిన ప్రగతిని  హైలైట్‌ చేస్తూ ప్రచురితమైన వార్తా అంశాలను ప్రధాని శనివారం ట్వీట్‌ చేశారు. ఈమేరకు అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్రం సాధించిన ప్రగతి నివేదికను మోదీ వెల్లడించారు. కొవిడ్‌ మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పుడు 100 దేశాలకు భారత్‌ ఔషధాలను ఎగుమతి చేసిందని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ కారిడార్ల ఏర్పాటు, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడంలాంటి చర్యలను ఆయన ప్రస్తావించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.