సెకండ్ హ్యాండ్ కారు కోసం 3 నెలల చిన్నారి అమ్ముకున్న దంపతులు

May 14 2021 @ 19:34PM

లఖ్‌నవూ: ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమల్లో తల్లిదండ్రుల ప్రేమ ఉన్నతమైనది, గొప్పది అంటుంటారు. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా ప్రేమకు అతీతులే. ఇంకా చెప్పాలంటే కిరాతకులుగా కూడా మారతారు. దీనికి ప్రత్యక్ష ఉదహారణ తాజాగా వెలుగు చూసింది. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవడం కోసం మూడు నెలల చిన్నారిని అమ్ముకున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు. రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలో జరిగిందీ ఘటన.


చిన్నారి అమ్మమ్మ, తాతయ్యలు ఇచ్చిన ఫిర్యాదుతో పిల్లాడి అమ్మకం విషయం బయట పడింది. కన్నౌజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవడం కోసం 1.5 లక్షల రూపాయలకు తమ కన్నబిడ్డను ఇద్దరు దంపతులు అమ్ముకున్నారు. అయితే తమకు ఈ విషయమై ఫిర్యాదు అందిందని గురువారం పేర్కొన్నారు. చిన్నారి ఇంకా వ్యాపారస్తుడి వద్దే ఉందని, చిన్నారి తల్లిదండ్రులను శుక్రవారం విచారిస్తామని ఇన్స్‌పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.