స్పేస్ సూట్‌లలో జంట బీచ్ వాక్.. వైరల్ అవుతున్న ఫోటోలు

ABN , First Publish Date - 2020-07-13T23:36:06+05:30 IST

బీచ్‌లో ఓ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. చేయి చేయి పెనవేసుకుని ఆనందంగా మొత్తం కలియతిరుగు...

స్పేస్ సూట్‌లలో జంట బీచ్ వాక్.. వైరల్  అవుతున్న ఫోటోలు

బ్రెజీలియా: బీచ్‌లో ఓ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. చేయి చేయి పెనవేసుకుని ఆనందంగా మొత్తం కలియతిరుగుతోంది. కానీ వారిని అందరూ వింతగా చూస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు. దీనికి కారణం వారు అందరిలా స్విమ్ సూట్‌లలోనో.. వెకేషన్ డ్రెస్‌లోనో లేరు. ఏకంగా స్పేస్ సూట్‌లో ఉన్నారు. కరోనా బారిన పడకుండా ఉండడానికే ఈ డ్రెస్‌ను ఎంచుకున్నట్లు టెర్సియో గల్డినో, అలీసియా లీమా జంట చెబుతున్నారు. తనకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి  సోకి తగ్గిందని, ఇలాంటి సమయంలో కరోనా సోకితే తాను ఎట్టిపరిస్థితుల్లోనూ బతకనని టెర్సియో పేర్కొన్నాడు. అయితే బీచ్‌కు రావాలని అనిపించిందని, అందుకోసమే ఈ స్పేస్ సూట్ ఐడియా ఫాలో అయ్యామని చెబుతున్నాడు. ఇదిలా ఉంటే వీరిని అక్కడి వారు అనేకమంది ఫొటోలు తీసి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2020-07-13T23:36:06+05:30 IST