రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి... రూ.27 లక్షల పరిహారం... ఆ తల్లిదండ్రుల నిర్ణయం ఏంటంటే..

Sep 28 2021 @ 07:40AM

రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోయారు. ఆ తరువాత వారు అందరి అభినందనలు అందుకునే నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపధ్యంలో మృతుని పేరిట అందిన రూ. 27.30 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అతని తల్లిదండ్రులు... పేదలు, ఆదివాసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. థానే మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అథారిటీ తాజాగా ఈ కేసును విచారించింది. 

2018, జూన్ 30న తమ 21 ఏళ్ల కుమారుడు రోడ్డు ప్రయాదంలో మృతి చెందిన నేపధ్యంలో అతని తల్లిదండ్రులు రూ. 50 లక్షల నష్ట పరిహారాన్ని కోరారు. ఆ యువకుడు ముంబైలోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రయాదంలో మృతి చెందాడు. అతను నడుపుతున్న కారు డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు ఆవలివైపునకు వెళ్లిపడింది. ఇంతలో ఎదురుగా వచ్చిన కంటైనర్ ఆ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు మృతి చెందాడు. ఆ యువకుని తల్లిదండ్రులకు బీమాకంపెనీ రూ. 27.30 లక్షలు ఇచ్చేందుకు సమ్మతించింది. ఈ సందర్భంగా ఆ దంపతుల ప్రతినిధి మాట్లాడుతూ ఈ మొత్తంతో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, దాని ద్వారా పేదలు, ఆదివాసీ చిన్నారులకు విద్యనందించనున్నారని తెలిపారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.