Bjp Mla Rajasinghకు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2022-08-24T01:08:57+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Bjp mla Rajasingh)కు బెయిల్ మంజూరు అయింది. 41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వకుండా ..

Bjp Mla Rajasinghకు బెయిల్ మంజూరు

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Bjp mla Rajasingh)కు బెయిల్ మంజూరు అయింది. 41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పిటిషనర్ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో రాజాసింగ్‌కు బెయిల్ (Bail) మంజూరు చేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. 


కాగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

Updated Date - 2022-08-24T01:08:57+05:30 IST