క్వారీ తవ్వకాలపై కోర్టు కమిషన్‌ విచారణ

ABN , First Publish Date - 2022-05-19T06:51:42+05:30 IST

ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో సర్వే నెం.2/1లో అక్రమ క్వారీయింగ్‌పై బుధవారం కోర్టు కమిషన్‌ విచారణ నిర్వహించింది.

క్వారీ తవ్వకాలపై కోర్టు కమిషన్‌ విచారణ
తోటపల్లి క్వారీ వద్ద అధికారుల విచారణ

ఆగిరిపల్లి, మే 18 :ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో సర్వే నెం.2/1లో అక్రమ క్వారీయింగ్‌పై బుధవారం కోర్టు కమిషన్‌ విచారణ నిర్వహించింది. 2017 సంవత్సరంలో 30.44 ఎకరాల భూమిలో గ్రావెల్‌ తవ్వకానికి ఎల్‌వీవీఆర్‌వీ ప్రసాద్‌కు అనుమతి ఇచ్చింది. లీజుదారుడు అనుమతికి మించి గ్రావెల్‌ తవ్వకం చేసి అక్రమాలకు పాల్పడినట్టు మద్దూరుకు చెందిన వై.రంజిత్‌కుమార్‌ కోర్టులో పిటిషన్‌ దాఖల చేశారు. ఈ మేరకు ఆ ఏరియాను సర్వే చేయాల్సిం దిగా కోర్టు ఆదేశిస్తూ విచారణకు కమిషన్‌ను నియమించింది. కోర్టు కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌. అశ్వద్ధనా రాయణ ఆధ్వర్యంలో ఫిర్యాదుదారు, లీజుదారుడు, మైనింగ్‌ శాఖ డీడీ, ఏడీ, ఆగిరిపల్లి తహసీలార్‌ వీవీ భరత్‌రెడ్డి, ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు, నూజివీడు మండల సర్వేయర్‌ తదితరులు పాల్గొన్నారు. క్వారీపై విచారణ నిర్వహించి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.

Updated Date - 2022-05-19T06:51:42+05:30 IST