మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులకు శిక్ష విధించిన కోర్టు.. పోలీసులు ఆ కేసులో ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-02-24T05:56:22+05:30 IST

ఒక మైనర్ బాలిక అత్యాచారం కేసులో 11 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న యువకుడిని కోర్టు నిర్దోషిగా తీర్పునిస్తూ విడుదల చేసింది. పోలీసుల తప్పిదం వల్లే నిర్దోషి అయిన యువకుడు జైలుశిక్ష అనుభవించాడని కోర్డు విచారణలో తేలింది. అలాగే.. అసలు నేరస్తుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాకుండా వదిలేశారని...

మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులకు శిక్ష విధించిన కోర్టు.. పోలీసులు ఆ కేసులో ఏం చేశారంటే..

ఒక మైనర్ బాలిక అత్యాచారం కేసులో 11 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న యువకుడిని కోర్టు నిర్దోషిగా తీర్పునిస్తూ విడుదల చేసింది. పోలీసుల తప్పిదం వల్లే నిర్దోషి అయిన యువకుడు జైలుశిక్ష అనుభవించాడని కోర్డు విచారణలో తేలింది. అలాగే.. అసలు నేరస్తుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాకుండా వదిలేశారని కూడా వెల్లడైంది. దీంతో ఈ కేసులో దర్యాప్తు చేసిన ముగ్గురు పోలీసులకు కఠిన శిక్ష విధించింది.


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రంలోని హిసార్ నగర సమీపంలో హాసీ గ్రామానికి చెందిన దీక్ష(12, పేరు మార్చబడినది) అనే బాలిక 2021 ఫిబ్రవరి 11న స్కూలుకు వెళుతుండగా.. ఒక యువకుడు ఆమెను ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసిన యువకుడి పేరు భూపా సింగ్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆ తరువాత పోలీసులు భూపా సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. కానీ భూపా సింగ్‌ను ఆ తరువాత క్లీస్ చిట్ ఇచ్చి వదిలేశారు.


కోర్టులో పోలీసులు ముకేశ్ అనే మరో యువకుడిని దీక్ష అత్యాచారం కేసులో నిందితుడిగా హాజరుపరిచారు. కోర్టు ముకేశ్‌ని దోషిగా తీర్పు చెబుతూ అతనికి కఠిన కారాగార శిక్ష వేసింది. ఈ విషయం 


దీక్ష తల్లిదండ్రులకు తరువాత తెలిసింది. నేరం చేసిన భూపా సింగ్ గ్రామంలో బలాదూర్‌గా తిరగడం చూసి వారు పోలీసులకు సంప్రదించారు. కానీ పోలీసులు వారిని పట్టించుకోకపోవడంతో కోర్టులో భూపా సింగ్‌పై కేసు వేశారు. 


దీక్ష అత్యాచారం కేసు పున: విచారణకు స్వీకరించిన కోర్టుకు పోలీసుల చేసిన తప్పుల గురించి తెలిసింది. కోర్టు అత్యాచారం అసలు నిందితుడు భూపాసింగ్‌ను దోషిగా ఖరారు చేస్తూ.. నిర్దోషి అయిన ముకేశ్‌ని విడుదల చేయాలని తీర్పునిచ్చింది. చేయని తప్పుకి 11 నెలల జైలు శిక్ష అనుభవించిన ముకేశ్‌కు కేసులో తప్పులు చేసిన ముగ్గురు పోలీసులు తలా రూ.2 లక్షలు చొప్పున రూ.6 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఆ ముగ్గురు పోలీసు అధికారులకు ఉద్యోగం నుంచి తొలగించాలని పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేసింది.



Updated Date - 2022-02-24T05:56:22+05:30 IST