పదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్.. విషయం పిల్లాడికి అర్థమవడంతో..

ABN , First Publish Date - 2022-04-20T08:29:28+05:30 IST

పదేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి 15 లక్షల రూపాయలు డబ్బు తీసుకోవాలని ముగ్గురు కుర్రాళ్లు ప్లాన్ వేశారు. దీనికోసం పిల్లాడి పెద్దమ్మ కుమారుడు కూడా ఈ కిడ్నాప్ ప్లాన్‌కు సహకరించాడు. అయితే కిడ్నాప్ మధ్యలోనే ఏం జరుగుతుందో ఆ బాలుడికి అర్థమైంది...

పదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్.. విషయం పిల్లాడికి అర్థమవడంతో..

పదేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి 15 లక్షల రూపాయలు డబ్బు తీసుకోవాలని ముగ్గురు కుర్రాళ్లు ప్లాన్ వేశారు. దీనికోసం పిల్లాడి పెద్దమ్మ కుమారుడు కూడా ఈ కిడ్నాప్ ప్లాన్‌కు సహకరించాడు. అయితే కిడ్నాప్ మధ్యలోనే ఏం జరుగుతుందో ఆ బాలుడికి అర్థమైంది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని భయపడిన ఆ కుర్రాళ్లు.. పిల్లాడిని హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది.


స్థానికంగా ఖోడా ప్రాంతంలో అజింత్ సింహ్ దంపతులు నివసించేవారు. వాళ్లకు బలియా ప్రాంతంలో ఒక స్కూల్ ఉంది. దీంతో వాళ్ల కుమారుడు పదేళ్ల హర్షను కిడ్నాప్ చేస్తే ఈజీగా 15-20 లక్షల రూపాయలు వస్తాయని ఆకాష్ అనే కుర్రాడు ప్లాన్ వేశాడు. హర్ష పెద్దమ్మ కుమారుడు ప్రియాంశు కూడా ఈ ప్లాన్‌కు అంగీకరించాడు. రాజీవ్ అనే మరో మిత్రుడితో కలిసి హర్షను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ర్యాబిట్ పార్క్‌కు తీసుకెళ్లి అక్కడే పిల్లాడి కాళ్లు చేతులు కట్టేయాలని ప్లాన్ వేశారు. దానికోసం అవసరమైన తాళ్లు కూడా వెంట తీసుకెళ్లారు. పిల్లాడిని కట్టేసి అజిత్ సింహ్ దంపతులకు ఫోన్ చేసి డబ్బు అడగాలనేది వాళ్ల ప్లాన్. 


కానీ హర్షకు జరుగుతుంది అర్థమై అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. తమ ప్లాన్ గురించి ఎక్కడ బయటపడిపోతుందో అనే భయంతో.. సోదరుడి వరుస అయ్యే ప్రియాంశు పిల్లాడి చేతులు కదలకుండా పట్టుకున్నాడు. రాజీవ్ అతని కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. ఆకాష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో హర్ష గొంతు, కడుపులో విచక్షణారహితంగా దాడి చేసి పిల్లాడిని చంపేశాడు. పిల్లాడు ప్రియాంశుతో పాటు వెళ్లాడని తెలిసి పోలీసులు అతన్ని విచారించారు. ఈ క్రమంలో తమ ప్లాన్ గురించి అతను బయటపెట్టేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు స్నేహితులను అరెస్టు చేశారు. పోస్టుమార్టం అనంతరం హర్ష మృతదేహం అందుకున్న తల్లిదండ్రులు.. హత్య జరిగిన నోయిడాలోనే అంత్యక్రియలు నిర్వహించారు.


Updated Date - 2022-04-20T08:29:28+05:30 IST