ఫ్రిజ్‌కే పరిమితమైన కొవ్యాగ్జిన్‌

ABN , First Publish Date - 2021-05-07T04:32:16+05:30 IST

కరోనా మహమ్మారి తీవ్రతకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వైరస్‌ ప్రాణాలు తీస్తోంది.

ఫ్రిజ్‌కే పరిమితమైన కొవ్యాగ్జిన్‌

  కావాల్సింది 12800 రెండో డోసులు

  జిల్లాకు వచ్చింది 1500 డోసులే

  కొవ్యాగ్జిన్‌ సెంటర్‌ ప్రకటనతో అధికారుల ఆందోళన

 వీఐపీలకే పరిమితం చేస్తారా అనే విమర్శలు

ఖమ్మంసంక్షేమవిభాగం, మే6: కరోనా మహమ్మారి తీవ్రతకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.   వయస్సుతో సంబంధం లేకుండా ఈ వైరస్‌ ప్రాణాలు తీస్తోంది. కొవిడ్‌ రక్షణకు ఉపయోగిస్తున్న కొవ్యాగ్జిన్‌ మాత్రం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఫ్రీజ్‌ లో దాక్కొంది. జిల్లాకు కొవ్యాగ్జిన్‌ 12,800 రెండో డోసులు దశల వారికి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ 1500 డోసులు మాత్రం రావటంతో వారు ఇబ్బంది పడుతు న్నారు. కోవాగ్జిన్‌ ప్రకటనతో ప్రజల తాకిడి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా రెండో డోసు గడువు ముగి సిన వారు 10వేల మంది వరకు ఉన్నారు. వీరంతా రెండో డోసు కొవ్యాగ్జిన్‌ కోసం ఎదురుచూ స్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు వచ్చిన కొవ్యాగ్జిన్‌ను బయట పెట్టేందుకు జిల్లా టీకాల అధికారులు ముందుకు రావటం లేదని చర్చ జరుగుతుంది. ఇదేక్రమంలో మొద టి డోసు కొవ్యాగ్జిన్‌ను జిల్లాలో కొంతమంది అఽధికార, అనాధికార వీఐపీలకు అందించారు. రెండో డోసును కూడా వారికి ఇవ్వోచ్చు అనే విమర్శలు వెలువడుతు న్నాయి. ఏదీఏమైనా జిల్లా పరిపాలన అధికారులు స్పందించి కొవ్యాగ్జిన్‌ పంపిణీపై ఆదేశాలు ఇవ్వాలని, రెండో డోసు వెయిటింగ్‌లో ఉన్న లబ్ధిదారులు కోరుతు న్నారు. ఈ విషయంపై జిల్లా టీకాల అధికారి అలివే లును వివరణ కొరగా రెండో డోసు వేయించుకునే వారు లేక పోవటంతో వ్యాక్సిన్‌ బయటకు తీయలేదన్నారు.

Updated Date - 2021-05-07T04:32:16+05:30 IST