కొవిడ్‌ నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ

ABN , First Publish Date - 2021-04-24T05:02:34+05:30 IST

రోజురోజుకూ కొవిడ్‌ ఉధృతం అవుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైందని, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు జిల్లా కొవిడ్‌ అధికారి డా. చేతన్‌ అన్నారు. శుక్రవారం డా. చేతన్‌, ఏవో డా. వినోద్‌ తదితరులు శుక్రవారం అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం, వినాయకపురం, గుమ్మడపల్లి ప్రాథమిక పీహెచ్‌సీలను సందర్శించారు.

కొవిడ్‌ నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ
అశ్వారావుపేటలో ఆసుపత్రిని పరిశీలిస్తున్న చేతన్‌, ఇతర వైద్యులు

అశ్వారావుపేటపేట సామాజిక ఆరోగ్యకేంద్రంలో 10 పడకల ఏర్పాటు

జిల్లాలో 3,024 యాక్టివ్‌ కేసులు

93,394 మందికి వ్యాక్సిన్‌

జిల్లా కొవిడ్‌ అధికారి చేతన్‌ వెల్లడి

అశ్వారావుపేట, ఏప్రిల్‌ 23: రోజురోజుకూ కొవిడ్‌ ఉధృతం అవుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైందని, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు జిల్లా కొవిడ్‌ అధికారి డా. చేతన్‌ అన్నారు. శుక్రవారం డా. చేతన్‌, ఏవో డా. వినోద్‌ తదితరులు శుక్రవారం అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం, వినాయకపురం, గుమ్మడపల్లి ప్రాథమిక పీహెచ్‌సీలను సందర్శించారు. ఈ సందర్భంగా డా. చేతన్‌ మాట్లాడుతూ అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ రోగులకు చికిత్స వైద్యం నిమిత్తం 10 పడకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర వినియోగం కోసం రెండు ఆక్సిజన్‌ సిలిండర్‌లు అందుబాటులో ఉంచామన్నారు. రోజు రోజుకు కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అ ప్రమత్తంగా ఉంటూ వైద్యసిబ్బందికి సహకరించాలని కోరారు. అత్యవసరమైతే పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్పు చేస్తామని అన్నారు. జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 3 లక్షల 76వేల 245 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహింగా, వాటిలో 25,794 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. 146 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3,024 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మా సిబ్బంది నిరంతర సేవలు అందిస్తున్నారన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

జిల్లాలో 93,394 మందికి కరోనా టీకా: డీడీహెచ్‌ఎంవో డా. వినోద్‌

జిల్లాలో ఇప్పటి వరకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు నలభై ఐదు సంవత్సరాలు దాటిన 93,394 మందికి కరోన టీకా వేశామన్నారు. టీకా విషయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉన్నామని, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. వారి వెంట వైద్యులు హరీష్‌, రాంబాబు, సిబ్బంది వెంకటేశ్వరరావు, సబ్‌యూనిట్‌ అధికారి అజ్మీర వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T05:02:34+05:30 IST