273 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-06-23T05:39:26+05:30 IST

కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ వ్యాప్తి నెమ్మదించినప్పటికీ టెస్టు చేయించుకొంటున్న ప్రతీ 100 మందిలో ఐదు గురికి పాజిటివ్‌ వస్తోంది.

273 మందికి కరోనా

5.41 శాతంగా పాజిటివ్‌ రేటు


గుంటూరు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ వ్యాప్తి నెమ్మదించినప్పటికీ టెస్టు చేయించుకొంటున్న ప్రతీ 100 మందిలో ఐదు గురికి పాజిటివ్‌ వస్తోంది. ఈ సంఖ్య ఒకటి లోపునకు వస్తేనే సెకండ్‌ వేవ్‌ అదుపులోకి వచ్చినట్లు. మంగళవారం ఉదయం వరకు 5,043 శాంపిల్స్‌ ఫలితాలు రాగా వాటిల్లో 273 మందికి వైరస్‌ సోకింది. పాజిటివ్‌ శాతం 5.41గా నమోదైంది. హోం ఐసోలేషన్‌లో ఉంటోన్నవారు 264 మంది కోలు కోవడంతో ప్రస్తుతం క్రియాశీలక కేసులు 3,172 వద్ద కొనసాగుతున్నాయి. కొవిడ్‌ రికవరీ శాతం జిల్లాలో 97.34 శాతానికి చేరుకొంది. రాజుపాలెం, గుంటూరులో ఒక్కొక్కరు కొవిడ్‌తో మరణించారు. కొత్తగా గుంటూరు నగరంలో 36, నాదెండ్లలో 13, చిలకలూరిపేటలో 12, నరసరావుపేటలో 11, తాడేపల్లిలో 10, అమరావతిలో 8, అచ్చంపేటలో 3, బెల్లంకొండలో 3, గుం టూరు రూరల్‌లో 5, క్రోసూరులో 2, మంగళగిరిలో 8, మేడికొండూరులో 1, ముప్పాళ్లలో 6, పెదకాకానిలో 2, పెదకూరపాడులో 9, పెదనందిపాడులో 5, ఫిరంగిపురంలో 1, ప్రత్తిపాడులో 2, రాజుపాలెంలో 6, సత్తెనపల్లిలో 6, తుళ్లూరులో 3, వట్టిచెరుకూరులో 3, దాచేపల్లిలో 9, గురజాలలో 8, కారం పూడిలో 5, మాచవరంలో 3, మాచర్లలో 7, పిడుగురాళ్లలో 6, రెంటచింత లలో 2, బొల్లాపల్లిలో 5, యడ్లపాడులో 2, ఈపూరులో 4, నూజెండ్లలో 9, నకరికల్లులో 3, రొంపిచర్లలో 3, శావల్యాపురంలో 3, వినుకొండలో 4, అమ ర్తలూరులో 1, భట్టిప్రోలులో 1, బాపట్లలో 6, చేబ్రోలులో 2, చెరుకుపల్లిలో 2, దుగ్గిరాలలో 2, కాకుమానులో 1, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 3, నగరంలో 1, నిజాంపట్నంలో 2, పొన్నూరులో 8, రేపల్లెలో 4, తెనాలిలో 7, చుండూరులో 3, వేమూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


15 వేల మందికి వ్యాక్సినేషన్‌

జిల్లాలో కొత్తగా 15 వేల మందికి కొవిడ్‌-19 టీకాని మంగళవారం వివిధ ఆరోగ్య కేంద్రాల్లో వేశారు. వీరిలో 9,548 మంది 45 ఏళ్లు దాటిన వారు, 53 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, నలుగురు హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, ఐదేళ్లలో పు పిల్లలు న్న తల్లులు 3,807, ప్రవాస భారతీయులు 76 మందికి తొలి డోస్‌ టీకాని వేశారు. రెండోడోస్‌ని 1,066 మందికి వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 

Updated Date - 2021-06-23T05:39:26+05:30 IST