132 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-07-25T05:18:02+05:30 IST

జిల్లాలో కొత్తగా 132 మందికి కరోనా వ్యాప్తి చెందినట్లు తేలింది. శనివారం ఉదయం వరకు 5,323 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా 2.48 శాతం మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది.

132 మందికి కరోనా

2.48 శాతంగా పాజిటివ్‌ రేట్‌


గుంటూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 132 మందికి కరోనా వ్యాప్తి చెందినట్లు తేలింది. శనివారం ఉదయం వరకు 5,323 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా 2.48 శాతం మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. దీంతో క్రియాశీలక కేసులు 1,580కి చేరాయి. కొవిడ్‌ రికవరీ శాతం 98.35కి పెరిగింది. కొత్తగా గుంటూరు నగరంలో 29, నరసరావుపేటలో 12, అచ్చంపేటలో 6, సత్తెనపల్లిలో 6, తాడేపల్లిలో 5, చిలకలూరిపేటలో 5, వట్టిచెరుకూరులో 5, గురజాలలో 5, మంగళగిరిలో 4, పెదకూరపాడులో 4, నూజెండ్లలో 4, పెదనందిపాడులో 3, దుగ్గిరాలలో 3, రేపల్లెలో 3, తెనాలిలో 3, చుండూరులో 3, పొన్నూరులో 3, రాజుపాలెంలో 2, తాడికొండలో 2, వినుకొండలో 2, తుళ్లూరులో 2,  గుంటూరు రూరల్‌లో 2, ఈపూరులో 2, అమరావతిలో 1, బెల్లంకొండలో 1, క్రోసూరులో 1, మేడికొండూరులో 1, పెదకాకానిలో 1, దుర్గిలో 1, వెల్దుర్తిలో 1, యడ్లపాడులో 1, నాదెండ్లలో 1, నకరికల్లులో 1, రొంపిచర్లలో 1, అమృతలూరులో 1, భట్టిప్రోలులో 1, బాపట్లలో 1, చెరుకుపల్లిలో 1, కొల్లిపరలో 1, కొల్లూరులో 1, నగరంలో 1, వేమూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కాగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శనివారం 45 ఏళ్ల వయస్సు దాటినవారు 2,381, ప్రవాస భారతీయులు 238, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు 1,102, గర్భిణులు 900, ప్రభుత్వ టీచర్లు 7, ప్రైవేటు ఉపాధ్యాయులు 11 మందికి తొలి డోసు టీకాని వేసినట్లు చెప్పారు. 4,086 మందికి రెండో డోసు టీకాని కూడా చేసినట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. 


 


Updated Date - 2021-07-25T05:18:02+05:30 IST