2,001 శాంపిల్స్‌.. 81 కేసులు

ABN , First Publish Date - 2021-07-27T05:11:50+05:30 IST

జిల్లాలో కొత్తగా 81 మందికి కరోనా వైరస్‌ సోకింది.

2,001 శాంపిల్స్‌.. 81 కేసులు

4.05 శాతానికి పెరిగిన పాజిటివ్‌ రేట్‌


గుంటూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 81 మందికి కరోనా వైరస్‌ సోకింది. సోమవారం ఉదయం వరకు 2,001 శాంపిల్స్‌ టెస్టింగ్‌ చేయగా అందులో పాజిటివ్‌రేట్‌ ఏకంగా 4.05 శాతంగా నమోదైంది. నిన్నటివరకు 3 కంటే తక్కువగా ఉంటూ వచ్చిన పాజిటివ్‌ శాతం పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. కాగా క్రియాశీలక కేసులు 1,533కి చేరాయి. కొత్తగా గుంటూరు నగరంలో 21, వినుకొండలో 6, నరసరావుపేటలో 5, అమర్తలూరులో 4, బాపట్లలో 3, కర్లపాలెంలో 3, అమరావతిలో 3, గుంటూరు రూరల్‌లో 1, మంగళగిరిలో 2, మేడికొండూరులో 1, పెదకూరపాడులో 1, పెదనందిపాడులో 1, ఫిరంగిపురంలో 1, తాడేపల్లిలో 2, సత్తెనపల్లిలో 1, తాడికొండలో 2, తుళ్లూరులో 3, గురజాలలో 1, మాచవరంలో 1, పిడుగురాళ్లలో 1, చిలకలూరిపేటలో 2, యడ్లపాడులో 2, నాదెండ్లలో 2, నూజెండ్లలో 1, నకరికల్లులో 1, రొంపిచర్లలో 3, పిట్టలవానిపాలెంలో 1, పొన్నూరులో 2, తెనాలిలో 2, చుండూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


మెగా వ్యాక్సినేషన్‌

కొవీషీల్డ్‌ డోసులు అందుబాటులోకి రావడంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 40,872, ప్రవాసభారతీయులు 1,822, ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలున్న తల్లులు 16,617, గర్భిణులు 2,254, దివ్యాంగులు 3, ప్రభుత్వ ఉపాధ్యాయులు 235, ప్రైవేటు టీచర్లు 253 మందికి తొలి డోసు టీకాని వేశారు. రెండో డోసు టీకాని 23,301 మందికి వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. మొత్తంగా సోమవారం 85 వేల మందికి పైగా వ్యాక్సిన్‌లు వేశామన్నారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో తొలి డోసు టీకా తీసుకొన్న వారి సంఖ్య 16 లక్షల 96 వేల 928 మందికి చేరింది. వీరిలో 4 లక్షల 64 వేల 654 మంది రెండో డోసు కూడా చేయించుకున్నారు. సోమవారం గురజాల, మాచర్ల, విజయపురిసౌత్‌, దుర్గి, మాచవరం, పిడుగురాళ్ల, సిరిగిపాడు, కంభంపాడు, ముటుకూరు, కారంపూడి, చిలకలూరిపేట, ఈపూరు, వినుకొండ, బొల్లాపల్లి, ఏముప్పాళ్ల, వినుకొండ, యడ్లపాడు, గణపవరం, చిలకలూరిపేట, కావూరు, పిట్టలవానిపాలెం, వేమూరు, మోపర్రు, కొల్లిపర, పొన్నూరు, బాపట్లలోని విశ్వబ్రాహ్మణ కాలనీ, పొన్నూరు, కొల్లూరు, చందోలు, బాపట్లలోని రైల్‌పేట, మంగళగరి ఎయిమ్స్‌, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, పెదవడ్లపూడి, పెదకూరపాడు, వట్టిచెరుకూరు, సత్తెనపల్లి, నల్లచెరువు, వెనిగండ్ల పీహెచ్‌సీ/సీహెచ్‌సీలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా తక్కువగా జరగడంపై కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ విచారణకు ఆదేశించారు. 

Updated Date - 2021-07-27T05:11:50+05:30 IST