18 ఏళ్లు పైబడిన వారికి ఈనెల 10 నుంచి కోవిడ్ బూస్టర్ డోస్

ABN , First Publish Date - 2022-04-08T21:20:54+05:30 IST

పద్దెనిమిదేళ్ల పైబడిన వారికి ఈనెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవిడ్ బూస్టర్ డోస్‌లు..

18 ఏళ్లు పైబడిన వారికి ఈనెల 10 నుంచి కోవిడ్ బూస్టర్ డోస్

న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల పైబడిన వారికి ఈనెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవిడ్ బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం శుక్రవారంనాడు ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 18 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత గల పౌరులకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా మొదటి, రెండవ విడత వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియతో పాటు హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ఇస్తున్న ప్రికాషన్ డోస్ (బూస్టర్) ప్రక్రియ కొనసాగుతోందని, దీనిని మరింత వేగవంతం చేస్తున్నామని తెలిపింది.


ఇంతవరకూ, దేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 96 శాతం మంది కనీసం ఒక విడత వ్యాక్సిన్ డోస్ తీసుకోగా, 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ఇంతవరకూ 2.4 కోట్ల మంది బూస్టర్ డోస్‌లు ఇచ్చామని, 12 నుంచి 14 ఏళ్ల లోపు వారిలో 45 శాతం మంది తొలి డోస్ తీసుకున్నారని వివరించింది.

Updated Date - 2022-04-08T21:20:54+05:30 IST