రాష్ట్రంలో టీకాలు వేసుకోని వారు ఇంకా కోటిమంది

ABN , First Publish Date - 2021-10-22T16:38:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిరోధక టీకాల కార్యక్రమా లను ఉద్యమంలా నిర్వహిస్తున్నా ఇంకా కోటిమందికి పైగా మొదటి డోసు టీకాలు వేసుకోలేదని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌ ప్రకటించారు. స్థానిక షెనాయ్‌న

రాష్ట్రంలో టీకాలు వేసుకోని వారు ఇంకా కోటిమంది

- మరో యేడాదిపాటు మాస్కులు తప్పనిసరి

- ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌


చెన్నై(Tamilnadu): రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిరోధక టీకాల కార్యక్రమా లను ఉద్యమంలా నిర్వహిస్తున్నా ఇంకా కోటిమందికి పైగా మొదటి డోసు టీకాలు వేసుకోలేదని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌ ప్రకటించారు. స్థానిక షెనాయ్‌నగర్‌లో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోకి వస్తోందని చెప్పారు. అయితే మరో యేడాదిపాటు ప్రజలందరూ ముఖాలకు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని సూచించారు. అదే సమయంలో తరచూ చేతులను శానిటైజర్‌ లేదా సబ్బునీళ్లతో శుభ్రంగా కడగాలని, భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఈ నిబంధనలను అందరూ తుచ తప్పకుండా పాటిస్తే కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టవచ్చని చెప్పారు. చెంగల్పట్టు, కాంచీపురం నడుమ పలు అంతస్థుల భవనంలో నివసిస్తున్నవారిలో 20 మందికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించినప్పుడు 15 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని, దీనికి కారణం భౌతికదూరం పాటించకపోవడమేనని ఆయన చెప్పారు. కరోనా నిరోధక టీకాలు వేయడంలో పలు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సరిపడా టీకాలు సరఫరా అవుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53.84 లక్షల డోసుల వరకూ టీకాలు నిల్వ ఉన్నాయని తెలిపారు. రాష్ట్రమంతటా ఇంకా 1.8 కోట్ల మంది మొదటి డోసు టీకాలు కూడా వేసుకోలేదని, రెండో డోసు టీకాలను 57 లక్షల మంది వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వృద్ధులందరూ టీకాలు వేసుకోవడానికి ఆసక్తి చూపాలని రాధాకృష్ణన్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-10-22T16:38:39+05:30 IST