బొమ్మూరు కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో మరిన్ని పడకలు

ABN , First Publish Date - 2021-05-09T05:48:39+05:30 IST

బొమ్మూరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితులకు మరిన్ని పడకలు, వసతులు సమకూర్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి తెలిపారు.

బొమ్మూరు కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో మరిన్ని పడకలు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 8: బొమ్మూరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితులకు మరిన్ని పడకలు, వసతులు సమకూర్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి తెలిపారు. ఇందులో భాగంగా హిందుస్తాన్‌ యునిలీవర్‌ లిమిడెట్‌ (హార్లిక్స్‌ఫ్యాక్టరీ), ఇంటర్నేషనల్‌ పేపర్‌మిల్లు యాజమాన్యాలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా పడకలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. హార్లిక్స్‌ ఫ్యాక్టరీ రూ.3 లక్షల వ్యయంతో 550 ప్లాస్టిక్‌ బకెట్లు, 5 వేల ప్లాస్టిక్‌ మగ్గులు ఇతర వస్తువులు సమకూర్చగా, ఇంటర్నేషనల్‌ పేపర్‌మిల్లు వారు రూ.14.63 లక్షలతో మంచాలు, పరుపులు సమకూర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ టి.రమేష్‌కిషోర్‌, సూపరింటెండెంట్‌ సోమసుందరరావు, కొవిడ్‌ అధికారిణి సుబ్రహ్మణ్యేశ్వరి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ ప్రియాంక, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ కోమల, డ్రగ్స్‌ ఏడీ విజయశేఖర్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:48:39+05:30 IST