దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు మహారాష్ట్రలోనే..

ABN , First Publish Date - 2022-01-20T16:46:16+05:30 IST

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కొవిడ్ కేసుల జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెలువరించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 43,697 కేసులు వెలుగు చూశాయి.

దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు మహారాష్ట్రలోనే..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కొవిడ్ కేసుల జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెలువరించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 43,697 కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో 40,499 కేసులు నమోదవగా... కేరళ రాష్ట్రంలో 34,199 కేసులు, గుజరాత్‌లో 20,966 కేసులు, తమిళనాడులో 26,981 కేసులు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 11,447 కేసులు, దేశ రాజధాని ఢిల్లీలో 13,785 కేసులు, హర్యానాలో 8847 కేసులు, జమ్ము కశ్మీర్‌లో 5818, గోవాలో 3936 కొవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated Date - 2022-01-20T16:46:16+05:30 IST