అగ్రారాజ్యంలో భారీగా నమోదైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-01T06:19:23+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. డెల్టా వేరియంట్ ఉధృతితో భారీ సంఖ్యలో ప్రజలు మహమ్మారి బారినపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 99,740 కరోనా కేసులు నమోదయ్యాయి

అగ్రారాజ్యంలో భారీగా నమోదైన కరోనా కేసులు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. డెల్టా వేరియంట్ ఉధృతితో భారీ సంఖ్యలో ప్రజలు మహమ్మారి బారినపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 99,740 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నీ కొవిడ్ బాధితులతో నిండిపోతున్నాయి. దీంతో మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్‌ను విధించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌లను ఆయా రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6.40లక్షల మంది ప్రజలు కొవిడ్ బారినపడగా.. 9వేల మందికిపైగా కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19.79కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 42.23లక్షలకు పెరిగింది. 


Updated Date - 2021-08-01T06:19:23+05:30 IST