అమెరికాలో మళ్లీ ముప్పు ముంచుకొస్తోందా..? ఒక్కరోజులోనే లక్ష కేసులు.. 8 నెలల్లో ఇదే మొదటిసారి..!

ABN , First Publish Date - 2021-08-28T10:52:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ ముప్పు మళ్లీ పెరుగుతోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి కేసులు నానాటికీ పెరుగుతుండడంతో ..

అమెరికాలో మళ్లీ ముప్పు ముంచుకొస్తోందా..? ఒక్కరోజులోనే లక్ష కేసులు.. 8 నెలల్లో ఇదే మొదటిసారి..!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ ముప్పు మళ్లీ పెరుగుతోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి కేసులు నానాటికీ పెరుగుతుండడంతో భయాందోళనలు వ్యక్తమువుతున్నాయి. గురువారం నమోదైన గణాంకాల ప్రకారం ఒక్కరోజులో దాదాపు లక్ష కేసులు నమోదుయ్యాయి. ఇది గత 8 నెలల గరిష్టానికి సమానమని అక్కడి హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ వెల్లడించింది. డెల్టా వేరియంట్ కేసులే అత్యధికంగా ఉన్నాయని, దీనివల్ల దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో గత నెలతో పోల్చితే ప్రస్తుతం నమోదవుతున్న కేసులు దాదాపు రెట్టింపయ్యాయి. గత వారం నుంచి గంట గంటకూ దాదాపు 500 మంది చొప్పున కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 


కాగా.. అమెరికాలో కోవిడ్ కేసుల  సంఖ్య ఈ ఏడాది జనవరి వరకు పెరిగాయి. జనవరి 6వ తేదీని కేసుల సంఖ్య పీక్ లెవెల్‌(1,32,051 కేసులు)కు చేరింది. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగించడంతో కోవిడ్ ప్రభావం గణనీయంగా తగ్గింది. జూన్ నాటికి అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. జూన్ 28 నాడు అత్యంత తక్కువగా 13,843 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే డెల్టా వేరియంట్ ప్రభావంతో మళ్లీ జూలైలో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ప్రస్తుతం ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఫ్లోరిడాలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత టెక్సాస్, కాలిఫోర్నియాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే అలబామా, ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో 95 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయి.


ఇకపోతే వ్యక్సినేషన్ కాని ప్రజల్లోనే డెల్టా వేరియంట్ ఉధృతంగా వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా రికార్డు స్థాయిలో పిల్లల్లో ఈ మహమ్మారి వ్యాపిస్తోందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ పేర్కొంది. ఇప్పటికే 2వేలకు పైగా చిన్న పిల్లలు కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. మొత్తం కోవిడ్ బారిన పడిన వారిలో ఇది 2శాతంగా ఉన్నట్లు తెలపింది. ఈ క్రమంలోనే పిల్లలకు కూడా ఫైజర్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-28T10:52:20+05:30 IST