అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లోనే..

ABN , First Publish Date - 2021-12-30T02:32:50+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా.. కరోనా పలు వేరియంట్లతో అల్లాడుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 4.41లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లోనే..

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా.. కరోనా పలు వేరియంట్లతో అల్లాడుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 4.41లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో సగానికిపైగా ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని సీడీసీ పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ముప్పు అధికంగానే ఉందని అభిప్రాయపడింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు సంబంధించిన సమాచారం పరిశీలిస్తే.. హాస్పటళ్లలో చేరే ముప్పు తక్కువగానే ఉంటుందని సీడీసీ అభిప్రాయపడింది. 


ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియాలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన కేసుల సంఖ్య 50లక్షలు దాటింది. దీంతో ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. అంతేకాకుండా ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు దాదాపు 75వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.




Updated Date - 2021-12-30T02:32:50+05:30 IST