గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య

ABN , First Publish Date - 2022-06-24T01:20:44+05:30 IST

దేశ ప్రజల్నిగడగడలాడించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ మెల్లమెల్లగా విస్తరిస్తోంది.

గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య

హైదరాబాద్: దేశ ప్రజల్నిగడగడలాడించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ మెల్లమెల్లగా విస్తరిస్తోంది.తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నా చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. గురువారం సాయంత్రానికి హైదరాబాద్ నగరంలో 315 కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత నాలుగు రోజుల కేసులను పరిశీలిస్తే ఈనెల 19వ తేదీన 180 నమోదు కాగా, 20న 185, 21వ తేదీన 240 కేసులు, 22వ తేదీన 292 కేసులు నమోదయ్యాయి.గత కొంతకాలం క్రితం అత్యల్పంగా 9 కేసులు మాత్రమే నమోదు అయినా తాజాగా కేసులు సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

Updated Date - 2022-06-24T01:20:44+05:30 IST