కంగారెత్తిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-23T05:42:18+05:30 IST

కరోనా ముంచు కొచ్చే సింది..

కంగారెత్తిస్తున్న కరోనా
ఆకివీడులో పరీక్షలు చేస్తున్న టెక్నీషియన్‌

పెరుగుతున్న కేసులు
 జ్వరమొచ్చినా భయం భయం


ఆకివీడు/పాలకొల్లు అర్బన్‌/వీరవాసరం, జనవరి 22 : కరోనా ముంచు కొచ్చే సింది.. ప్రతీ ఇంటా భయపెడుతోంది.. చిన్న పిల్లలను సైతం ఽథర్డ్‌ వేవ్‌ వదలడంలేదు..ఇబ్బడిముబ్బడిగా కేసులు వస్తూనే ఉన్నాయి. సాధారణ జ్వరపీడితులు సైతం కరోనా వచ్చేసిందే మోనని హడలిపోతున్నారు. ఆకివీడు యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ పరిధిలో  25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 పాజిటివ్‌ వచ్చాయన్నారు. ఆకివీడు పోలీస్‌ స్టేషన్‌లోనూ ఒకరు కరోనా బారిన పడ్డారు. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో నలు గురు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు నోడల్‌ ఆఫీసర్‌ బీవీ.రమణ తెలిపారు. శనివారం కొత్త కేసులు రాలేదని చెప్పారు. వీరవాసరంలో అధికారులకు అందిన నివేదికల ప్రకారం  శనివారం కొణితివాడ పీహెచ్‌సీలో 12 కేసులు, వీరవాసరం పీహెచ్‌సీలో రెండు కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి.


కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు పెంచాలి


నరసాపురం టౌన్‌, జనవరి 22: తీరంలో కొవిడ్‌ కేసులు పెరుగుతు న్నందున ప్రభుత్వం పరీక్షా కేంద్రాలు మరింత పెంచాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన కొవిడ్‌ పరీక్షలు బాగా తగ్గిపోయాయన్నారు.ఈ కారణంగా సోమత్త లేని ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయిం చుకోవాల్సి వస్తుందన్నారు. కొవిడ్‌బారిన పడిన వారికి ఉచితంగా మం దులు, పోషకాహారం పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


పెరుగుతున్న జర్వాలు


వీరవాసరం, జనవరి 22 : గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. గత వారంలో కురిసిన వర్షాలు, వాతావరణంలో మార్పులు, చలి తీవ్రత, మంచు ప్రభావం వంటి కారణాలతో జ్వరాల తీవ్రత పెరుగుతోంది. ప్రతీ కుటుంబంలో ఎవరో ఒకరూ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రాఽథమిక చికిత్స కేంద్రాల వద్ద సేవలకు క్యూకడుతున్నారు. మరో పక్క కొవిడ్‌ భయం వెంటాడుతోంది.  కొంత మంది పాజిటివ్‌ భయంతో వెనకంజ వేస్తున్నారు.


Updated Date - 2022-01-23T05:42:18+05:30 IST