కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆర్డీవో పరిశీలన

ABN , First Publish Date - 2022-01-19T05:28:00+05:30 IST

చింతలపూడిలో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు టీటీడీ కల్యాణ మండపాన్ని ఆర్డీవో పనబాక రచన మంగళవారం పరిశీ లించారు.

కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆర్డీవో పరిశీలన
కళ్యాణమండపం పరిశీలిస్తున్న ఆర్డీవో

చింతలపూడి, జనవరి 18: చింతలపూడిలో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు టీటీడీ కల్యాణ మండపాన్ని ఆర్డీవో పనబాక రచన మంగళవారం పరిశీ లించారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో కొవి డ్‌ సెంటర్లు ఏర్పాటు చేయను న్నారు. అనంతరం తహసీల్దా ర్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. పట్టణంలో ఎనిమిది లేఅవుట్ల పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ ప్రమద్వర, గృహ నిర్మాణ శాఖ డీఈ రంగారావు, నగర పంచాయతీ కమిషనర్‌ రాంబాబు పాల్గొన్నారు.


కొవిడ్‌ సిబ్బంది విధులకు మినహాయింపు లేదు


కొవ్వూరు: కొవిడ్‌ ఆసుపత్రులలో విధులు కేటాయించిన అధికారులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, ఎటువంటి మినహాయింపులు ఉండబోవని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు. ఆర్డీవో కార్యాలయం నుంచి నోడల్‌ అదికారులతో మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ విధులు కేటాయించిన సహాయ నోడల్‌ అధికారులు, సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 24 గంటలలో విధులలో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్ప్‌డెస్క్‌ మేనేజ్‌మెంటు ద్వారా కొవిడ్‌ ఆసుపత్రుల నిర్వహణ బా ధ్యత చేపట్టాల్సి ఉందన్నారు. కొవిడ్‌ బాధితులు ఆసుపత్రికి వస్తే బెడ్‌ మ్యా పింగ్‌ మేరకు కేటాయింపు చేయాలన్నారు. షిప్ట్‌ల వారీగా డాక్టర్లు, సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ఫుడ్‌, ఆక్సిజన్‌, మందుల బృందాలు వెంటనే విదుల్లో చేరాలన్నారు. ప్రతి షిఫ్ట్‌లో స్టాఫ్‌నర్స్‌, ఆక్సిజన్‌ హెల్పర్‌, టెక్నీషియన్‌ అందుబాటులో ఉండాలన్నారు. డాక్టర్‌ జగదీష్‌, డాక్టర్‌ ధర్మరాజు బెడ్స్‌ కేటాయింపు, యాప్‌ నిర్వహణ వంటి అంశాలను వివరించారు.

Updated Date - 2022-01-19T05:28:00+05:30 IST