కోనలో కట్టుదిట్టంగా కరోనా అంక్షలు

ABN , First Publish Date - 2022-01-23T03:35:33+05:30 IST

పెంచలకోన క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.

కోనలో కట్టుదిట్టంగా కరోనా అంక్షలు
కోనలో శ్రీవార్ల కల్యాణం

రాపూరు, జనవరి 22: పెంచలకోన క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవార్లను దర్శించుకున్నారు.  శ్రీవారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతరాలయ, తీర్థ, శఠారీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అన్నదాన పత్రంలో సహపంక్తి భోజనాలకు బదులు 1200 మంది భక్తులకు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందించినట్లు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా కరోనా నియమావళి బోర్డులు ఏర్పాటు చేసి పుష్కరిణి బంద్‌ చేశారు. కరోనా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఆలయ ఏసీ, ఆలయ  కమిటీ చైర్మన్‌  సంయుక్త ప్రకటన విడుదల చేశారు

Updated Date - 2022-01-23T03:35:33+05:30 IST