జీహెచ్‌ఎంసీలో మళ్లీ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌

ABN , First Publish Date - 2021-04-20T07:26:09+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను తిరిగి ప్రారంభించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీలో మళ్లీ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను తిరిగి ప్రారంభించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా.. ప్రజలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పెద్దఎత్తున బయో వ్యర్థాలు వస్తున్నాయని, వీటిని నిబంధనల ప్రకారం నిర్వహించేలా ఆస్పత్రుల్లో చేపడుతోన్న చర్యలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రజలు ఉపయోగించిన మాస్క్‌లు రోడ్లపై పడేస్తున్నారని, ఇవి కూడా బయో మెడికల్‌ వ్యర్థాల కిందకు వస్తాయని, వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా, సంబంధిత అంశాలపై పౌరుల అవసరాలను తీర్చేందుకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక నోడల్‌ టీం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. 


Updated Date - 2021-04-20T07:26:09+05:30 IST