కొవిడ్‌ సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూమ్‌

ABN , First Publish Date - 2021-05-09T05:56:40+05:30 IST

కొవిడ్‌ సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూమ్‌

కొవిడ్‌ సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూమ్‌

వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, మే 8 : కొవిడ్‌-19 సంబంధిత సమస్యలు, సందేహాల నివృత్తి కోసం డీఎంహెచ్‌వో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాకు సంబంధించిన అన్ని రకాల సమాచారం కోసం 7993969104కు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ నెంబర్‌ 24గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన  వివరించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు టెలీమెడిసిన్‌, వైద్య సలహాల కోసం 7995118405 నెంబర్‌కు ఉదయం 10గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంప్రదించవచ్చని వివరించారు. దీంతో పాటు 9392469344 నెంబర్‌కి వీడియో కాల్‌ చేసి కరోనా బాధితులు తమ సమస్యలను వైద్యులకు తెలియజేయవచ్చు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.  

Updated Date - 2021-05-09T05:56:40+05:30 IST