కార్పొరేషన్‌ కార్యాలయంలో కరోనా కంట్రోల్‌ రూం

ABN , First Publish Date - 2021-04-23T05:00:59+05:30 IST

నెల్లూరు నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా కార్పొరేషన్‌ అధికారులు సమాచార వ్యవస్థను పటిష్టం చేశారు. ఇందులో భాగంగా గురువారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూంను అందుబాటులోకి తీసుకువచ్చారు.

కార్పొరేషన్‌ కార్యాలయంలో కరోనా కంట్రోల్‌ రూం
కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సిబ్బంది

నెల్లూరు (సిటీ), ఏప్రిల్‌ 22 : నెల్లూరు నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా కార్పొరేషన్‌ అధికారులు సమాచార వ్యవస్థను పటిష్టం చేశారు. ఇందులో భాగంగా గురువారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూంను అందుబాటులోకి తీసుకువచ్చారు. నగరంలో ఎక్కడైనా పాజిటివ్‌ కేసులు బయటపడిన నేపఽథ్యంలో ఆయా ప్రాంతాలలో పారిశుధ్య పనులను మెరుగు పరచనున్నారు. కార్పొరేషన్‌ నుంచి సహాయక చర్యలు అవసరమైతే కమాండ్‌ కంట్రోల్‌ రూము నెంబరు 0861-2355350ను సంప్రదించాలని అధికారులు కోరారు.

Updated Date - 2021-04-23T05:00:59+05:30 IST