కరోనా మృతుల కుటుంబీకులకు తలా రూ.లక్ష

ABN , First Publish Date - 2021-05-09T18:30:24+05:30 IST

యశ్వంతపుర నియోజకవర్గం పరిధిలో కరోనాతో మృతిచెందినవారి కుటుంబీకులకు తలా రూ.లక్ష పరిహారాన్ని, అలాగే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారికి రూ.50వేల ఆర్థిక చేయూతను స

కరోనా మృతుల కుటుంబీకులకు తలా రూ.లక్ష

 


బెంగళూరు: యశ్వంతపుర నియోజకవర్గం పరిధిలో కరోనాతో మృతిచెందినవారి కుటుంబీకులకు తలా రూ.లక్ష పరిహారాన్ని, అలాగే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారికి రూ.50వేల ఆర్థిక చేయూతను సహకారశాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డు, పంచా యతీలో కొవిడ్‌తో మృతి చెందినవారికి, చికిత్స పొందుతున్నవారికి వ్యక్తిగత సాయం అందచేశారు. కెంగేరీ వార్డు వినాయక దేవాలయం వద్ద ఆదిచుంచనగిరి పీఠాధి పతి నిర్మలానందనాథస్వామిజీ సమక్షంలో శనివారం 27 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.లక్షను అందచేశారు. ఆదివారం నుంచి కొవిడ్‌ పరిష్కార చర్య లు మరింత వేగిరం చేయనున్నట్టు తెలిపారు. బీబీఎం పీ నుంచి ఆసుపత్రిలో చేరినవారికి రూ.25వేలు, సొంతంగా ప్రైవేటు ఆసుపత్రిలో చేరినవారికి రూ.50 వేలతో పాటు నిత్యావసరాలు, మెడికల్‌ కిట్‌ ఇవ్వ నున్నట్టు తె లిపారు. మంత్రి కార్యవైఖరి ఇతరులకు మా దిరిగా ఉం టుందని స్వామిజీ ప్రశంసించారు. 


టెక్సాస్‌ నుంచి 86 ఐసీయూ పడకలు 

అంతర్జాతీయస్థాయిలో పేరొందిన అమెరికాకు చెందిన టెక్సాస్‌ కంపెనీ కర్ణాటక ప్రభుత్వానికి రూ.3కోట్ల వి లువైన మాడ్యులర్‌ ఐసీయూ విభాగాలను విరాళంగా ఇచ్చింది. శనివారం ముఖ్యమంత్రిని కలసి వారు విరాళం ఇచ్చారు. టెక్సాస్‌ కంపెనీ సీనియర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీకిచెందిన సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ 1985లో బెంగళూరులో టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీ ప్రారంభించామని, బెంగళూరు, కర్ణాటకతో మాకు అనుబంధం ఉందన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి తీవ్రంగా ఉందని తమవంతుగా చిరు ప్రయత్నం చేశామని తెలిపారు. 

    ఇదే సందర్భంగా సీఎం మాట్లాడుతూ టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కంపెనీ 86 ఐసీయూ పడకలు సమకూర్చడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని కార్పొరేట్‌ సంస్థలు, వాణిజ్య సంస్థలను సీఎస్‌ఆర్‌ గ్రాంట్‌ ద్వారా ప్రజలకు అనుకూలమైన సేవలు అందించాలని కోరుతామన్నారు. సమాచారశాఖ కమిషనర్‌ పీఎస్‌ హర్ష, వైద్యవిద్యాశాఖ కార్యదర్శి టీకే అనిల్‌కుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T18:30:24+05:30 IST