Covid ఎఫెక్ట్‌ .. స్వరాష్ట్రాలకు వెళుతున్న కార్మికులు

ABN , First Publish Date - 2022-01-18T15:39:38+05:30 IST

ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులు ఉపాధి కోసం కోయంబత్తూర్‌ వస్తుంటారు. కుటుంబాలతో వచ్చే కార్మికులు సుమారు రెండు, మూడు నెలలు ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. గత ఏడా

Covid ఎఫెక్ట్‌ .. స్వరాష్ట్రాలకు వెళుతున్న కార్మికులు

పెరంబూర్‌(చెన్నై): ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులు ఉపాధి కోసం కోయంబత్తూర్‌ వస్తుంటారు. కుటుంబాలతో వచ్చే కార్మికులు సుమారు రెండు, మూడు నెలలు ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. గత ఏడాది మార్చి నుంచి ప్రారంభమైన కరోనా మొదటి అల కారణంగా పలువురు కార్మికులు పనులు మానేసి స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో పరిశ్రమలు స్తంభించాయి. అనంతరం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కోవైకు వచ్చే ఉత్తరాది కార్మికుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో, తాజాగా కరోనా, ఒమైక్రాన్‌ తీవ్రత అధికం కావడంతో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వస్తున్న వారికి విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. గత రెండు వారాల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 1,200 మంది పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలిన అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో, రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో స్వరాష్ట్రాలకు వెళ్లే కార్మికులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి.

Updated Date - 2022-01-18T15:39:38+05:30 IST