
- మంత్రి హెచ్చరిక
ఐసిఎఫ్(చెన్నై): రాష్ట్రంలో కరోనా నాలుగో అల వ్యాప్తి చెందే అవకాశముందని, ప్రజలు ఒకటి, రెండు నెలలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం హెచ్చరించారు. తిరువణ్ణామలైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూన్లో కరోనా నాలుగో అల వచ్చే అవకాశముందని కాన్పూర్ ఐఐటీ నిపుణులు హెచ్చరించారని, చైనా, సింగపూర్, మలేసియా సహా కేరళ రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. మరికొన్ని నెలలు ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి