దేశంలో కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-08-11T22:03:28+05:30 IST

దేశంలో కరోనా కలవరం

దేశంలో కరోనా కలవరం

న్యూఢిల్లీ: కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు వచ్చి మళ్లీ దేశంలో కరోనా వైరస్ కలవరపెడుతూనే ఉంది. ప్రమాదకర డెల్టా వేరియంట్ చాపకింద నీరుగా విస్తరిస్తోంది. దేశంలోని 44 జిల్లాల్లో వారపు పాజిటివ్ రేట్ 10 శాతంగా ఉంది. కేరళలో ఏకంగా లక్షకు పైగా యాక్టివ్ కేసులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


కేరళతోపాటు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మేఘాలయ, మిజోరం తదితర 9 రాష్ట్రాల్లోని 37 జిల్లాల్లో రోజు వారి కేసులు పెరుగుదల ఆందోళనకర స్థాయిలో ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించారు. ఈ 37 జిల్లాల్లో 11 జిల్లాలు కేరళలో ఉన్నాయి.


దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్‌ను 86 శాంపిల్స్‌లో గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. కేరళలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం డెల్టా రకానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. కేరళలో ఆర్‌- వాల్యూ ఒకటికి మించి కొనసాగుతోంది. అక్కడ టెస్ట్ పాజిటివిటీ రేట్ 16 శాతంగా ఉంది.

Updated Date - 2021-08-11T22:03:28+05:30 IST