ప్రజలందరికీ ఉచితంగా ఆయుర్వేద మందు

ABN , First Publish Date - 2021-06-24T05:37:43+05:30 IST

రాష్ట్రంలోని ప్ర జలందరికీ కొవిడ్‌ నివారణకు ఉచితంగా ఆయుర్వే ద మందును అందజేసేందుకు చర్యలు చేపడుతు న్నట్లు కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. బు ధవారం ఒంగోలు వచ్చిన ఆయన విలేఖరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఎం పీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు, యువ పారిశ్రామికవేత్త రాఘవరెడ్డితో కలిసి ఆనందయ్య స్థానిక పీఎల్‌ఆర్‌ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న మాగుంట ఎడ్యుకేషనల్‌ సొసైటీ స్థలాన్ని ప రిశీలించారు.

ప్రజలందరికీ ఉచితంగా ఆయుర్వేద మందు
మాగుంట రాఘవరెడ్డితో ఆనందయ్య

ఆనందయ్య వెల్లడి


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 23 : రాష్ట్రంలోని ప్ర జలందరికీ కొవిడ్‌ నివారణకు ఉచితంగా ఆయుర్వే ద మందును అందజేసేందుకు చర్యలు చేపడుతు న్నట్లు కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. బు ధవారం ఒంగోలు వచ్చిన ఆయన విలేఖరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఎం పీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు, యువ పారిశ్రామికవేత్త రాఘవరెడ్డితో కలిసి ఆనందయ్య స్థానిక పీఎల్‌ఆర్‌ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న మాగుంట ఎడ్యుకేషనల్‌ సొసైటీ స్థలాన్ని ప రిశీలించారు. అక్కడ ఆయుర్వేద మందును తయా రు చేసేందుకు తీసుకోవాల్సిన అవశ్యకతపై రాఘ వరెడ్డితో చర్చించారు. అనంతరం రామ్‌నగర్‌లోని మాగుంట కార్యాలయంలో ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. అనంతరం జరిగిన విలేఖరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజ లందరికీ ఆయుర్వేద మందును అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఆయుర్వేద మందుకు అ నుమతి రాకముందు నుంచే ఎంపీ మాగుంట శ్రీని వాసులురెడ్డి అందించిన సహకారాన్ని మర్చిపోలే మని చెప్పారు. మందు తయారు చేసేందుకు అ వసరమైన ముడిసరుకు ఉన్నా అవసరమైన పరి కరాలు లేని కారణంగా కొంత ఇబ్బందికర పరి స్థితులు ఏర్పడ్డాయన్నారు. వాటన్నింటిని అధికమి ంచి ప్రజలందరికి ఉచితంగా మందును అందజే స్తామని ఆనందయ్య చెప్పారు. కార్యక్రమంలో తా తా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


మంత్రి బాలినేని నివాసంలో..


అనంతరం స్థానిక లాయర్‌పేటలోని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన తన యుడు, యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డిని ఆనంద య్య కలిశారు. అక్కడ కూడా ఆయుర్వేద మందు తయారీపై  చర్చించారు. ఈ సందర్బంగా ఆనంద య్యను ప్రణీత్‌రెడ్డి, మేయర్‌ గంగాడ సుజాత, వైసీపీ నగర అద్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఘ నంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేద మందు తయారీకి మం త్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అందించిన సహకారాన్ని మర్చిపోలేమన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి కూ డా ఉచితంగా మందును అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.


Updated Date - 2021-06-24T05:37:43+05:30 IST