కరోనా.. కన్నెర్ర

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

జిల్లాలో కొత్తగా 1,212 కరోన కేసులు నమోదయ్యాయి. శనివారం 7,612 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా వారిలో 15.92 శాతం మందికి వైరస్‌ చేరినట్లు తేలింది.

కరోనా.. కన్నెర్ర

కొత్తగా 1,212 మందికి వైరస్‌

15.92 శాతంగా పాజిటివ్‌ రేటు


గుంటూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 1,212 కరోన కేసులు నమోదయ్యాయి. శనివారం 7,612 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా వారిలో 15.92 శాతం మందికి వైరస్‌ చేరినట్లు తేలింది. దీంతో క్రియాశీలక కేసులు 6,195కి చేరాయి. వారిలో 5,845 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 340 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. వారిలో వెంటిలేటర్‌పై 8 మంది, ఐసీయూలో 63, ఆక్సిజన్‌ పడకలపై 128, నాన్‌ ఐసీయూలో 149 మంది ఉన్నారు. కాగా కొత్తగా గుంటూరు నగరంలో 622, నరసరావుపేటలో 111, మంగళగిరిలో 64, తాడేపల్లిలో 57, తెనాలిలో 38, తుళ్లూరులో 28, సత్తెనపల్లిలో 23, చిలకలూరిపేటలో 22, మాచర్లలో 17, రొంపిచర్లలో 16, పెదకాకానిలో 16, పిడుగురాళ్లలో 13, రాజుపాలెంలో 12, ఫిరంగిపురంలో 12, రేపల్లెలో 11, అమరావతిలో 2, అచ్చంపేటలో 3, బెల్లంకొండలో 1, గుంటూరు రూరల్‌లో 6, క్రోసూరులో 5, మేడికొండూరులో 3, ముప్పాళ్లలో 3, పెదకూరపాడులో 4, పెదనందిపాడులో 3, ప్రత్తిపాడులో 4, తాడికొండలో 7, వట్టిచెరుకూరులో 3, దాచేపల్లిలో 8, దుర్గిలో 7, గురజాలలో 4, కారంపూడిలో 5, మాచవరంలో 2, రెంటచింతలలో 5, యడ్లపాడులో 6, ఈపూరులో 2, నాదెండ్లలో 5, నూజెండ్లలో 1, నకరికల్లులో 8, శావల్యాపురంలో 1, వినుకొండలో 1, అమర్తలూరులో 4, భట్టిప్రోలులో 3, బాపట్లలో 7, చేబ్రోలులో 2, చెరుకుపల్లిలో 1, దుగ్గిరాలలో 3, కాకుమానులో 1, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 5, కొల్లూరులో 6, నగరంలో 1, నిజాంపట్నంలో 1, పిట్టలవానిపాలెంలో 4, పొన్నూరులో 9, చుండూరులో 2, వేమూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


కొవిడ్‌ చికిత్సకు 87 ఆస్పత్రులకు అనుమతి

కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం జిల్లావ్యాప్తంగా 87 ఆస్పత్రులను అధికార యంత్రాంగం నోటిఫై చేసింది. వాటిల్లో 6,500 పడకలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఆక్సిజన్‌ బెడ్స్‌ - 3,510, ఐసీయూ పడకలు - 1,108, జనరల్‌ బెడ్స్‌ - 1,882, వెంటిలేటర్‌ సదుపాయం కలిగిన పడకలు - 298గా ఉన్నట్లు తెలిపింది. మూడు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 700 పడకలను సిద్ధం చేసింది. నిత్యం లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ 15.70 ఎంటీలు వస్తుండగా 14.70 ఎంటీలను వినియోగిస్తున్నారు. గత 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 117 మంది డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో కొత్తగా 116 మంది చేరారు.


పెనాల్టీల వసూలు

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పెనాల్టీలను విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం మాస్కు ధరించని 235 మంది వద్ద రూ.24,750 వసూలు చేశామన్నారు. ఇప్పటివరకు 85,295 మంది వద్ద రూ.88,91,779 పెనాల్టీగా వసూలు చేయడం జరిగిందన్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న 56 దుకాణాలను మూయించామన్నారు.


పాజిటివ్‌ శాతంలో తేడా..?

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ శాతం 10.09గా ఉన్నది. మొత్తం 5,245 టెస్టులు చేయగా 529 మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ప్రైవేటు ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్‌ శాతం 35.35గా నమోదైంది. 1,423 మందికి టెస్టులు చేస్తే 503 మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వం యాంటిజెన్‌ టెస్టులు 411 మందికి చేస్తే 15(3.65 శాతం) మందికి పాజిటివ్‌ రాగా అదే ప్రైవేటు యాంటిజెన్‌ టెస్టులు 533 మందికి చేస్తే 165(30.96 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న టెస్టుల్లో పాజిటివ్‌ శాతం తక్కువగా, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎక్కువగా నమోదు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా టెస్టుల నిర్వహణ తీరుపై పర్యవేక్షణ జరపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST