పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగిటివ్..!

Apr 20 2021 @ 17:08PM

జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోవిడ్ బారినపడ్డారనే వార్త బయటకు రాగానే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. కొంతమంది అభిమానులు, జన సైనికులు సైతం పూజలు నిర్వహించారు. పవన్ ఆరోగ్యం బావుండాలని.. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించారు. వారందరి పూజలు ఫలించాయి. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్‌గా నిర్దారణ అయిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పవన్‌కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో... ఆయన త్వరగానే కోలుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో ఆసుపత్రి వైద్యులు గాని, జనసేన వర్గాలు గాని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.