త్వరలో భారత్‌లో కోవిడ్ నాజిల్ స్ప్రే...

ABN , First Publish Date - 2021-08-03T02:07:33+05:30 IST

కోవిడ్ -19 చికిత్స కోసం నాజిల్ స్ప్రేను... ఇండియాతోపాటు ఇతర ఆసియా దేశాల్లో వాణిజ్యపరంగా అందించేందుకుగాను... కెనడియన్ బయోటెక్ సంస్థ సానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది.

త్వరలో భారత్‌లో కోవిడ్ నాజిల్ స్ప్రే...

ముంబై : కోవిడ్ -19 చికిత్స కోసం నాజిల్ స్ప్రేను... ఇండియాతోపాటు ఇతర ఆసియా దేశాల్లో వాణిజ్యపరంగా అందించేందుకుగాను... కెనడియన్ బయోటెక్ సంస్థ సానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది. ప్రత్యేకమైన దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద... భారత్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, తైవాన్, నేపాల్, బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, శ్రీలంక, వియత్నాంలలో నైట్రిక్ ఆక్సైడ్ నాజిల్ స్ప్రేను తయారు చేయడంతోపాటు మార్కెటింగ్ జరగనుంది. ఇక... ఇతర దేశాలకు కూడా పంపిణీ ఉంటుందని భారతీయ కంపెనీ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. ఈ ఒప్పందం విషయమై గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా మాట్లాడుతూ ‘సానోటైజ్‌తో భాగస్వామ్యం కోవిడ్ -19 కు వ్యతిరేకంగా గ్లెన్‌మార్క్  కేంద్రీకృత విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-03T02:07:33+05:30 IST