చుట్టేస్తోంది!

ABN , First Publish Date - 2022-01-19T06:58:08+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఎక్కడికక్కడ వ్యాపిస్తూ వందల మందిని చుట్టేస్తోంది. ఫలితంగా జిల్లాలో కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది. రోజూ రెండు వందలకు మించి పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా మళ్లీ కొవిడ్‌ భయం అలుముకుంటోంది. మునుపటి సెకండ్‌ వేవ్‌ తరహాలో కేసులు పంజా విసురుతాయోమననే ఆందోళన అందరినీ వెన్నాడు తోంది. ప్రస్తుతం వైరస్‌ వేగంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బెంబేలెత్తుతోంది. గడిచిన పది రోజుల్లో ఏకంగా 2,233 కేసులు నమోదవడంతో పెరుగుతున్న ముప్పుతో కలవరపడుతోంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నైట్‌ కర్ఫ్యూ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. రాత్రి పదకొండు తర్వాత జిల్లావ్యాప్తంగా పోలీసులు రహదారులపై గస్తీ నిర్వహించారు. వచ్చీపోయే వారి గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. అనుమతి లేకుండా బయట తిరిగినవారిపై జరిమానాల మోత మోగించారు.

చుట్టేస్తోంది!

జిల్లాలో కొవిడ్‌ కేసులు అంతకంతకూ విశ్వరూపం

10 రోజుల్లో ఏకంగా 2,233 మందికి పాజిటివ్‌ 

మొత్తం 2,97,625కి చేరిన పాజిటివ్‌లు:.. యాక్టివ్‌ కేసులు 2,458 

ఒకపక్క వందల్లో బాధితులు తేలుతున్నా రోజుకు 5 వేలలోపే టెస్ట్‌లు

బయట ప్రైవేటు ల్యాబ్‌ల్లో భారీగా పెరుగుతున్న అనధికార పరీక్షలు

కాకినాడలో టీటీడీ కల్యాణ మండపంలో కొత్తగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ 

మరోపక్క జిల్లాలో మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ

రహదారులన్నీ నిర్మానుష్యం.. ఎక్కడికక్కడ పోలీసులు పహారా

అనవసరంగా బయట తిరుగుతున్న వారిపై జరిమానా బాదుడు


జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఎక్కడికక్కడ వ్యాపిస్తూ వందల మందిని చుట్టేస్తోంది. ఫలితంగా జిల్లాలో కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది. రోజూ రెండు వందలకు మించి పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా మళ్లీ కొవిడ్‌ భయం అలుముకుంటోంది. మునుపటి సెకండ్‌  వేవ్‌ తరహాలో కేసులు పంజా విసురుతాయోమననే ఆందోళన అందరినీ వెన్నాడు తోంది. ప్రస్తుతం వైరస్‌ వేగంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బెంబేలెత్తుతోంది. గడిచిన పది రోజుల్లో ఏకంగా 2,233 కేసులు నమోదవడంతో పెరుగుతున్న ముప్పుతో కలవరపడుతోంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నైట్‌ కర్ఫ్యూ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. రాత్రి పదకొండు తర్వాత జిల్లావ్యాప్తంగా పోలీసులు రహదారులపై గస్తీ నిర్వహించారు. వచ్చీపోయే వారి గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. అనుమతి లేకుండా బయట తిరిగినవారిపై జరిమానాల మోత మోగించారు. 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ కేసుల తీవ్రత జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతోంది. గత పది రోజుల కింద వరకు నిత్యం యాభై వరకు వచ్చే పాజిటివ్‌లు ఇప్పుడు 200 నుంచి 300 మధ్య నిర్ధారణ అవుతున్నాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి వేగం ప్రజలను, అధికారులను హడలె త్తిస్తోంది. ఈనెల 9 నుంచి 18 వరకు రోజువారీ కొవిడ్‌ బులిటెన్లను పరిశీలిస్తే పెరిగి పోతున్న పాజిటివ్‌లు పొంచి ఉన్న ముప్పును హెచ్చరిస్తున్నాయి. ఈనెల 9న జిల్లాలో 93 మందికి కొవిడ్‌ సోకగా, 10న 117, 11న 84, 12న 274, 13న 247, 14న 327, 15న 303, 16న 233, 17న 263, 18న 292 మందికి వైరస్‌ సోకింది. దీంతో మంగళవారం నాటికి జిల్లాలో మొత్తం పాజిటివ్‌లు 2,97,625కు చేరుకున్నాయి. కొవిడ్‌సోకి వివిధ ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితులు 2,458 మందిగా తేలారు. వైరస్‌బారిన పడుతున్న వారిలో ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుండడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సెలవులు ప్రకటించకుండా బోధన కొనసాగిస్తుండడంతో ఎక్కడ పిల్లలు వైరస్‌ బారిన పడతారోననే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కూనవరంలో మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులకు కొవిడ్‌ నిర్ధా రణ కావడంతో విద్యార్థులంతా ఉలిక్కిపడ్డారు. అధికారులు సైతం వైరస్‌ బారిన పడు తుండడం కలవరం పెంచుతోంది. జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబుకు పాజిటివ్‌గా తేలడంతో కలెక్టరేట్‌లో ఉన్నతాధికారుల్లో గుబులు రేగుతోంది. పాజిటివ్‌ల తీవ్రత ఇంత పెరుగుతున్నా కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య మాత్రం పెంచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


సెకండ్‌వేవ్‌లో ఎక్కడికక్కడ పీహెచ్‌సీలతోపాటు సంచార బస్సు ల్లోను పరీక్షలు చేశారు. కానీ ప్రస్తుతం టెస్ట్‌లు పెరగకపోవడంతో పల్లెలు, పట్టణాల్లో అనేకమంది ప్రైవేటు ల్యాబ్‌లకు క్యూకడుతున్నారు.అక్కడే రహస్యంగా టెస్ట్‌లు చేయి స్తున్నారు. పాజిటివ్‌ వస్తే దగ్గర్లో మెడికల్‌ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వాడు తున్నారు. దీంతో ప్రస్తుతం వస్తున్న అధికారిక కొవిడ్‌ కేసుల్లో చాలా వరకు లెక్కల్లోకి రావడం లేదు. కాగా జిల్లాలో వైరస్‌ తీవ్రత పెరుగుతుండడంతో బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో జిల్లావైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలు కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు సిద్ధంచేస్తున్నాయి. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లోని టీటీడీ కల్యాణమండపాన్ని, జేఎన్టీయూలోని నాగార్జున హాస్టల్‌ను కొవిడ్‌ కేర్‌ కేంద్రాలుగా సిద్ధంచేశారు. సామర్లకోటలో మరొ కటి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండగలో కోడిపందేలు, గుండాటల్లో ఎక్కడా జనం పెద్దగా మాస్క్‌లు ధరించలేదు. దీంతో రానున్న రోజుల్లో కేసులు భారీగా పెరిగే అవ కాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు న్నవారు టెస్ట్‌లు చేయించకోవాలని సూచిస్తున్నారు. మరోపక్క రోజూ కొత్తగా వస్తున్న కొవిడ్‌ బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పి తదితర లక్షణాలే అధికంగా ఉంటున్నాయని, శ్వాససంబంధిత సమస్యలు వంటివి లేకపోవడం కొంతవరకు ఊరటనిచ్చే అంశమని జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి వివరించారు. అయినా కొవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్యుల సంఖ్య పెంపు, ఆక్సిజన్‌ లభ్యత వంటివి సిద్ధం చేశామని వివరించారు. కాగా జిల్లాలో మంగళవారం రాత్రి 11 నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో పోలీసులు పహారా కాశారు. రాకపోకలను నియంత్రించేందుకు ప్రధాన రహదారులపై అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆ సమయంలో ప్రయాణించేవారిని ఆపి ఆరా తీశారు. అనవసరంగా బయట తిరిగితే కేసులు నమో దుచేస్తామని హెచ్చరించారు. మాస్క్‌లు లేని, బయట తిరిగిన వారిపై జరిమానా విధించారు. 


రాత్రి కర్ఫ్యూ పటిష్టంగా అమలు : ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కాకినాడ క్రైం: కొవిడ్‌ నియంత్రణ కోసం రాత్రిపూట కర్ఫ్యూను పటిష్టంగా అమలుచేస్తామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నివారణ కోసం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు జిల్లా ప్రజానీకం సహకారించాలని కోరారు. ఈనెలాఖరు వరకు రాత్రిపూట కర్ప్యూ ఉంటుందని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలవుతాయని చెప్పారు. ఈ సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లు, ఎమ ర్జన్సీ సర్వీసుల కింద పనిచేసే ఆసుపత్రులు, ల్యాబ్‌లు, ఫార్మసీలు, ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు, ఐటీ, ఆధారిత సేవలు, పెట్రోలు, విద్యుత్తు, తాగునీరు, పారిశుధ్యం, డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది తదితరులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఉంటుందన్నారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులకు వెళ్లేవారు విధిగా వాలిడిటీ టిక్కెట్‌ కలిగి ఉండాలని కోరారు. మాస్క్‌ధారణ తప్పనిసరని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధిస్తాన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సినిమాహాల్స్‌, మతపరమైన సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరని ఎస్పీ చెప్పారు.


Updated Date - 2022-01-19T06:58:08+05:30 IST