కుటుంబ ఆదాయాలపై కోవిడ్ దెబ్బ విలువ రూ.13 లక్షల కోట్లు!

ABN , First Publish Date - 2021-03-07T00:41:45+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సామాన్యుల ఉపాధి అవకాశాలపై

కుటుంబ ఆదాయాలపై కోవిడ్ దెబ్బ విలువ రూ.13 లక్షల కోట్లు!

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సామాన్యుల ఉపాధి అవకాశాలపై చావు దెబ్బ కొట్టింది. దీని పర్యవసానాలు 2021లో మొదటి ఆరు నెలల వరకు ఉంటాయనే హెచ్చరికలు వస్తున్నాయి. డిమాండ్ తగ్గుతుందని, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని చెప్తున్నారు. 


కోవిడ్-19 మహమ్మారి సమయంలో కుటుంబాల ఆదాయాల నష్టం విలువ రూ.13 లక్షల కోట్లు అని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా నివేదిక వెల్లడించింది.  అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో, మూడో త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకోవడం ఆశ్చర్యం కలిగించిందని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కుటుంబ ఆదాయాలు తగ్గాయని, దీని ప్రభావం ప్రజల వినియోగ సామర్థ్యంపై ఈ ఏడాది జూన్ వరకు కనిపిస్తుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) క్షీణత 7.5 శాతానికి పరిమితమైందని తెలిపారు. మూడో త్రైమాసికంలో ఇది 40 బేసిస్ పాయింట్లు పెరిగిందని చెప్పారు. 


Updated Date - 2021-03-07T00:41:45+05:30 IST