కోవిడ్ రోగులను పోలీసుల ప్రయోగంతో వెనక్కి పంపిస్తున్న ఆస్పత్రి సిబ్బంది

ABN , First Publish Date - 2021-05-07T20:58:24+05:30 IST

కోవిడ్ రోగులకు కచ్చితంగా బెడ్ కేటాయించాలని సీఎం జగన్ పదే పదే చెబుతున్నా, అధికారులు మాత్రం వారి పట్ల

కోవిడ్ రోగులను పోలీసుల ప్రయోగంతో వెనక్కి పంపిస్తున్న ఆస్పత్రి సిబ్బంది

కృష్ణా : కోవిడ్ రోగులకు కచ్చితంగా బెడ్ కేటాయించాలని సీఎం జగన్ పదే పదే చెబుతున్నా, అధికారులు మాత్రం వారి పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. అంతేకాకుండా చికిత్స కోసం ఎదురుచూస్తున్న వారిని పోలీసులచే గెంటేయిస్తున్నారు.  అవనిగడ్డలో ఇలాంటి వ్యవహారం జరిగింది. అక్కడ కోవిడ్ రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. 12 ఆక్సిజన్ బెడ్స్ వరకూ మాత్రమే రోగులను చేర్చుకొని, మిగిలిన వారిని ఆస్పత్రి సిబ్బంది గాలికొదిలేశారు. దీంతో రోగుల కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 104 ద్వారా ఆస్పత్రిలో బెడ్ ఎలాట్ చేయించుకున్న వారినీ సిబ్బంది ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అంతేకాకుండా ఆస్పత్రి వద్ద ఎదురుచూస్తున్న రోగులను పోలీసుల సాయంతో సిబ్బంది వెనక్కు పంపించేశారు. 50 పడకల ఆస్పత్రిలో మరో 38 సాధారణ బెడ్లు అందుబాటులో ఉన్నా, ఆక్సిజన్ లేదంటూ సిబ్బంది చేర్చుకోలేదు. 

Updated Date - 2021-05-07T20:58:24+05:30 IST