15,947 మందికి Covid పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-18T17:40:41+05:30 IST

రాజధాని నగరంలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ఆదివారంతో పోలిస్తే సోమవారం సుమారు 6వేల కేసులు తగ్గడం ఒకింత ఊరటనిస్తోంది.

15,947 మందికి Covid పాజిటివ్‌

                  - Bengaluruలో తగ్గిన covid కేసులు


బెంగళూరు: రాజధాని నగరంలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ఆదివారంతో పోలిస్తే సోమవారం సుమారు 6వేల కేసులు తగ్గడం ఒకింత ఊరటనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27,156 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా బెంగళూరులోనే 15, 947 కేసులు ఉన్నాయి. మైసూరులో 1770, తుమకూ రు 1147, హాసన్‌ 1050, మండ్య 917, ధార్వాడ 784, బళ్లారిలో 560, బెంగళూరు గ్రామీణలో 538, దక్షిణకన్నడ 490, కలబుర్గి 479, కోలారు 463, ఉడుపి 442 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో వందల్లో కేసులు నమోదయ్యాయి. 7,827 మంది కోలుకున్నారు. 14 మంది మృతిచెందగా బెంగళూరులో ఐదుగురు, దక్షిణకన్నడ ముగ్గురు, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మిగిలిన జిల్లాల్లో మృతులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం 2,17, 297 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 1,57, 254మంది ఉన్నారు. బెంగళూరును కొవిడ్‌కు దిపేస్తుండగా మరోవైపు ఒమైక్రాన్‌ కూడా వెంటాడుతోంది. సోమవారం బెంగళూరులోనే ఏకంగా 287 మందికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఒమైక్రాన్‌ బాధితులు 766కు పెరిగారన్నారు. 

Updated Date - 2022-01-18T17:40:41+05:30 IST