కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.48 శాతం

ABN , First Publish Date - 2021-09-30T06:23:26+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు తగ్గుతోందని, ప్రస్తుత్తం 2.48 శాతం ఉన్నట్లు డీఎంహెచ్‌వో శ్రీహరి చెప్పారు.

కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.48 శాతం

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 29: జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు తగ్గుతోందని, ప్రస్తుత్తం 2.48 శాతం ఉన్నట్లు డీఎంహెచ్‌వో శ్రీహరి చెప్పారు. మదనపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మదనపల్లె అర్బన్‌, కలికిరిలో ఐదుశాతం ఉందన్నారు. కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు, మైక్‌ ద్వారా ప్రచారం చేయాల్సిన బాద్యత వైద్య, మున్సిపల్‌ సిబ్బందిపై ఉందన్నారు. కొవిడ్‌  వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలన్నారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక ఫీజులు, లింగ నిర్ధరణ పరీక్షలపై కేసు నమోదు చేయడమే కాకుండా వాటి రిజిస్ర్టేషన్‌ రద్దు చేస్తామన్నారు.  ఆరోగ్యశ్రీ గుర్తింపు కలిగిన ఆస్పత్రుల్లో డబ్బులు వసూలు  చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.  సచివాలయ ఏఎన్‌ఎంలు, కొవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది డీఎంహెచ్‌వోను కలసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వైద్యసిబ్బంది ఆయన్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు లోకవర్ధన్‌, రాజశేఖర్‌రెడ్డి, బాలాంజనేయులు, పాల్‌ రవికుమార్‌, అనుపమ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-30T06:23:26+05:30 IST