‘కరోనా నిబంధనలు మరింత కఠినం’

ABN , First Publish Date - 2021-05-11T17:13:53+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ రోజురోజుకూ విస్తరిస్తోందని, దాన్ని కట్టడి చేయడానికి నిబంధనలను మరింత కఠినం చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి ఆనంద్‌ సింగ్‌ అన్నారు. సోమవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో

‘కరోనా నిబంధనలు మరింత కఠినం’

   - మృతుల్లో జిల్లా రెండో స్థానం....  కేసుల్లో మూడో స్థానం : జిల్లా మంత్రి ఆనంద్‌ సింగ్‌


బళ్లారి (కర్ణాటక): జిల్లాలో కొవిడ్‌ రోజురోజుకూ విస్తరిస్తోందని, దాన్ని కట్టడి చేయడానికి నిబంధనలను మరింత కఠినం చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి ఆనంద్‌ సింగ్‌ అన్నారు. సోమవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ మృతుల్లో జిల్లా రెండో స్థానం, కేసుల నమోదులో మూడు స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు 50 మందితో శుభకార్యాలను నిర్వహించుకోవచ్చని, అయి తే జిల్లాలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 24వ తేదీ వరకు జిల్లాలో ఎలాంటి  శుభకార్యక్రమాలు నిర్వహిం చడా నికి అనుమతి లేదని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అవకాశం ఉంటుందన్నారు.

ఆరోగ్యపరమైన విషయాలకు మినహా ఇతరత్ర వాటికి ఎవరికి బయటకు రావడానికి అనుమతి లేదన్నారు.  ఈ సమావేశంలో కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలిపాటిల్‌, ఎస్పీ సైదుల్లా అదావత్‌, జడ్పీ సీఈఓ నందిని పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T17:13:53+05:30 IST