
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజువారీగా వేల సంఖ్యలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల ఇవాళ ఇద్దరు మృతి చెందారని అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం 7,26,819 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇప్పటి వరకు మొత్తం 4,069 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 1,670 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి