వ్యాక్సిన్‌ తర్వాత కొవిడ్‌ టెస్ట్‌?

ABN , First Publish Date - 2021-06-08T15:19:30+05:30 IST

వ్యాక్సిన్‌ కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తుందనే మాట వాస్తవమే అయినా, కొవిడ్‌ సోకకుండా ఆపలేదు. అయితే ఇన్‌ఫెక్షన్‌ సోకినా వ్యాక్సిన్‌తో శరీరంలో తయారైన యాంటీబాడీలు వైరస్‌ను అడ్డుకుని,

వ్యాక్సిన్‌ తర్వాత కొవిడ్‌ టెస్ట్‌?

ఆంధ్రజ్యోతి(08-06-2021)

వ్యాక్సిన్‌ కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తుందనే మాట వాస్తవమే అయినా, కొవిడ్‌ సోకకుండా ఆపలేదు. అయితే ఇన్‌ఫెక్షన్‌ సోకినా వ్యాక్సిన్‌తో శరీరంలో తయారైన యాంటీబాడీలు వైరస్‌ను అడ్డుకుని, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రం కాకుండా ఆపుతాయి. అయితే అరుదుగా కొందరిలో ఇన్‌ఫెక్షన్‌ పెరిగి, తీవ్ర రూపం దాల్చే అవకాశాలూ ఉండవచ్చు. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కొవిడ్‌ సోకినట్టు అనుమానం ఉన్న సందర్భాల్లో జ్వరం, దగ్గు లాంటి కొవిడ్‌ లక్షణాలు బయల్పడిన వెంటనే కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవడం అవసరం. లక్షణాలు బయల్పడని అసింప్టమాటిక్‌ వ్యక్తులకు కొవిడ్‌ టెస్ట్‌ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్‌... వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి మీద ప్రభావం చూపించకపోయినా, వారి నుంచి ఇతరులకు వ్యాపించే వీలు ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ నియమాలు కొనసాగించవలసి ఉంటుంది.

Updated Date - 2021-06-08T15:19:30+05:30 IST