టీకా వేయించుకున్నా అమెరికా ప్రయాణానికి కొవిడ్ పరీక్షలు తప్పనిసరి

Dec 3 2021 @ 02:04AM

అమెరికా వెళ్లాలంటే ప్రయాణానికి ముందురోజు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధన టీకా వేయించుకున్నప్పటికీ అందరికీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


ఇప్పటివరకు యుఎస్ బయలుదేరడానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రోజుకు పరిమితం చేస్తున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడిసీ) తెలిపింది.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.