Mumbai airportలో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్ష తప్పనిసరి

ABN , First Publish Date - 2022-01-05T12:36:33+05:30 IST

ముంబై విమానాశ్రయానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది....

Mumbai airportలో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్ష తప్పనిసరి

ముంబై: ముంబై విమానాశ్రయానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది.మహారాష్ట్రలో మంగళవారం 18,466 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజు కంటే 52 శాతం లేదా 6,303 కేసులు ఎక్కువ వెలుగుచూశాయి. కరోనా వల్ల 20 మంది మరణించారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం విమానాశ్రయంలో కరోనా రోగ లక్షణాలు ఉన్న రోగులను సెవెన్‌హిల్స్ హాస్పిటల్ లేదా బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకువెళతారు.కరోనా లక్షణాలు లేని వారిని బీకేసీ లేదా కంజుర్‌మార్గ్ బీఎంసీ జంబో కొవిడ్ కేంద్రానికి, లేదా హోటల్‌కు తీసుకెళతారు.విదేశీ ప్రయాణికులకు కరోనా నెగెటివ్ వస్తే వారు ఇంటికి వెళ్లవచ్చు.


 కానీ వారు ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. మహారాష్ట్రలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 67,30,494కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 1,41,573కి పెరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది.మహారాష్ట్రలో గత 24 గంటల్లో 75 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒమైక్రాన్ కేసుల సంఖ్య 653కి చేరుకుంది.ముంబై, థానే సిటీ,పూణే, పన్వెల్, కొల్హాపూర్, నాగ్‌పూర్, పింప్రి-చించ్‌వాడ్, భివాండి నిజాంపూర్ నగరాల్లో కరోనా కేసులు వెలుగుచూశాయి. 

Updated Date - 2022-01-05T12:36:33+05:30 IST