100 టెస్టుల్లో.. 30 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-07T05:44:00+05:30 IST

కొవిడ్‌ టెస్టులు జరుగుతున్న ప్ర తీ వంద స్వాబ్‌ శాంపిల్స్‌లో సగ టున 25–30 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతుంది.

100 టెస్టుల్లో.. 30 మందికి కరోనా

అర్బన్‌ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోన్న వైరస్‌

1,088 పాజిటివ్‌ కేసులు – ఐదుగురి మృతి

నేడు దిగుమతి కానున్న కోవాగ్జిన్‌ నిల్వలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 6 : కొవిడ్‌ టెస్టులు జరుగుతున్న ప్ర తీ వంద స్వాబ్‌ శాంపిల్స్‌లో సగ టున 25–30 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతుంది. ఆ మేరకు జిల్లాలో పాజిటివిటి రేటు 30 శా తం వరకు నమోదవుతోంది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. జిల్లాలో గడచి న పది రోజులుగా పాజిటివిటి రేటు క్రమేణా పెరుగుతోంది. ముఖ్యంగా అర్బన్‌ ప్రాంతాల్లో దీనిని గుర్తించారు. అధికారిక మార్గదర్శకాల ప్రకారం పాజిటి విటి రేటు 20 శాతం దాటితే ప్రమాదకర సంకేతాలుగా పరి గణిస్తారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కోవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఆర్‌ఆర్‌టీ టీమ్‌లతో మొబైల్‌ టెస్టింగ్‌లను చేపట్టారు. ఐసీఎంఆర్‌ సవరించిన మార్గదర్శకాల ప్రకారం ర్యాపిడ్‌ యాంటి జెన్‌ టెస్ట్‌ (ఆర్‌ఏటీ)లో ఫలితం పాజి టివ్‌ వస్తే దానిని గుర్తించి చికిత్సలను ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన స్వాబ్‌లలో 90 శాతం వరకు వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులను మాత్రమే చేయాలని నిర్దేశించ గా, తాజాగా ట్రూనాట్‌, ఆర్టీఏ టెస్టుల ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.


1,088 పాజిటివ్‌ కేసులు

గురువారం సాయంత్రం వరకు వెల్లడైన కొవిడ్‌ టెస్టుల ఫలి తాల్లో 1088 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరో ఐదు గురు మృతి చెందారు. హోం ఐసొలేషన్‌, ఆసుపత్రులు, క్వారం టైన్‌ కేంద్రాల్లో 9,434 మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసులతో జిల్లాలో కొత్తగా 40చోట్ల కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు కానున్నాయి.


నేడు కోవాగ్జిన్‌ నిల్వలు రాక

రెండో డోసు కోసం నెలల తరబడి వేచి చూస్తున్న కోవాగ్జిన్‌ టీకా మందు లబ్ధిదారులకు ఊరటనిచ్చే సమాచారం ఇది. జిల్లా కు సుమారు తొమ్మిది వేల కోవాగ్జిన్‌ నిల్వలు శుక్రవారం దిగుమ తి కానున్నాయి. ఆ మేరకు రాష్ట్ర అధికారుల నుంచి జిల్లాకు స మాచారం అందింది. అయితే ఈ నిల్వలను కేవలం రెండో డోసు కోసం నిరీక్షిస్తున్న కోవాగ్జిన్‌ లబ్ధిదారులకు మాత్రమే వినియో గిస్తారు. అక్కడక్కడ మిగిలిన కొద్దిపాటి నిల్వలతో గురువారం 130 సీవీసీల్లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. దీంతో మొత్తం 37 వేల డోసుల కోవిషీల్డ్‌ నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి. మళ్లీ కొత్తగా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నిల్వలు జిల్లాకు అందిన తరువాతే తొలి డోసు వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది.

Updated Date - 2021-05-07T05:44:00+05:30 IST