Covid టెస్ట్‌కు అదనంగా ఫీజు వసూలు చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-01-07T16:21:27+05:30 IST

కొవిడ్‌ పరీక్షల కోసం తాము నిర్ణయించిన ధర కంటే అదనంగా ఫీజు వసూలు చేసే ప్రైవేటు ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసు కుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా పరీక్షల కోసం వచ్చిన వారి జాబితా, ఫలితాలు ఎప్పటికప్పుడు

Covid టెస్ట్‌కు అదనంగా ఫీజు వసూలు చేస్తే చర్యలు

                    - ప్రైవేటు ల్యాబ్‌లకు ప్రభుత్వం హెచ్చరిక


ఐసీఎఫ్‌(చెన్నై): కొవిడ్‌ పరీక్షల కోసం తాము నిర్ణయించిన ధర కంటే అదనంగా ఫీజు వసూలు చేసే ప్రైవేటు ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసు కుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా పరీక్షల కోసం వచ్చిన వారి జాబితా, ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది. అదేవిధంగా ల్యాబ్‌ టెక్నీషియన్లకు భద్రతా ఉపకరణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. కరోనా పరీక్షా రిపోర్టులను ఐపీఎంఆర్‌, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో వెంటనే అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ముఖ్యమంత్రి ఆరోగ్యబీమా పథకం కింద రూ.400, బీమా కార్డు లేనివారికి రూ.700, ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయడానికి అదనంగా రూ.300 మాత్రమే వసూలు చేయాలని, దీనికి మించి అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖాధికారులు హెచ్చరించారు.

Updated Date - 2022-01-07T16:21:27+05:30 IST