ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలి

ABN , First Publish Date - 2021-04-18T05:14:27+05:30 IST

వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలుకు విచ్చే ప్రయాణికు లకు థర్మర్‌స్ర్కీనింగ్‌ చేపట్టి అవసరమైన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని కలెక్టర్‌ పోలా భా స్కర్‌ ఆదేశించారు. శనివారం ఒంగోలు ఆర్టీసీ డిపోను పరిశీలించిన అనంతరం ఆయన సంబ ంధిత అధికారులతో సమీక్ష చేశారు.

ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలి
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ భాస్కర్‌

బస్టాండులో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ఆర్టీసీ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం 


ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 17 : వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలుకు విచ్చే ప్రయాణికు లకు థర్మర్‌స్ర్కీనింగ్‌ చేపట్టి అవసరమైన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని కలెక్టర్‌ పోలా భా స్కర్‌ ఆదేశించారు. శనివారం ఒంగోలు ఆర్టీసీ డిపోను పరిశీలించిన అనంతరం ఆయన సంబ ంధిత అధికారులతో సమీక్ష చేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్టీసి డిపోలో ప్రయాణికులు వచ్చి, వెళ్లే మార్గాలను నిశింత గా పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలో ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఒంగోలు నగరం లో 586 కరోనా కేసులు నమోదు అయినందు న, వైరస్‌ వ్యాప్తి అరికట్టడానికి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఒంగోలు డిపోలో 24 గం టలూ కెమెరాతో కూడిన థర్మల్‌స్ర్కీనింగ్‌ చేపట్టి ప్రయాణికుల టెంపరేచర్‌ను బట్టి కరోనా పరీ క్షలు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. ఇం దుకోసం ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంల సేవలను షి ఫ్ట్‌ పద్ధతిలో 24 గంటలు పనిచేసేలా చూడాల న్నారు. బస్టాండ్‌ వద్ద ప్రయాణికుల నియంత్ర ణకు సెక్యూరిటీని ఉంచాలని ఆదేశించారు. ఇత ర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్ప నిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకునేలా మై కు ద్వారా ప్రచారం చేయాలన్నారు. ప్రజలు, ప్ర యాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల ని, చేతులను శానిటైజర్‌ చేసుకోవాలని చెప్పా రు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాల్స్‌, పవిత్ర స్థలాలు, మతపరమైన ప్రదేశాలలో పరిమితం గా హాజరై కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నా రు. సమావేశంలో ఆర్‌ఎం విజయగీత, డీఎస్పీ ప్రసాద్‌, కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ రమా దేవి, నగర కమిషనర్‌ భాగ్యలక్ష్మి, ఎంఈ డి. సుందరరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అ నంతరం కలెక్టర్‌ ప్రకాశంభవనంలోని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌రూంలోని కాల్‌ సెంటర్‌ ప నితీరును పరిశీలించారు. 


Updated Date - 2021-04-18T05:14:27+05:30 IST